అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు వద్దు! | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు వద్దు!

Published Fri, May 30 2014 2:08 AM

No charges for the inter-state power supply!

విభజన నేపథ్యంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలను వసూలు చేయవద్దని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖకు రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీల కింద యూనిట్‌కు 13 నుంచి 15 పైసల మేరకు వసూలు చేస్తారు. విభజన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్య ఉన్న విద్యుత్ లైన్లు అన్నీ అంతరాష్ట్ర విద్యుత్ లైన్లుగా మారుతుండడంతో... చార్జీలను వసూలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర చార్జీలను వసూలు చేయవద్దని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. అదేవిధంగా ఇరు ప్రాంతాల మధ్య ఉన్న లైన్లు.. ట్రాన్స్‌కోకు చెందినవే కావడంతో అసలు చార్జీలను వసూలు చేయాల్సిన అవసరం లేదని ఈ లేఖలో ఇంధనశాఖ అభిప్రాయపడింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement