చర్చిల నిర్మాణానికి కలెక్టర్ అనుమతి అక్కర్లేదు: కేసీఆర్ | Sakshi
Sakshi News home page

చర్చిల నిర్మాణానికి కలెక్టర్ అనుమతి అక్కర్లేదు: కేసీఆర్

Published Fri, Aug 15 2014 10:03 AM

చర్చిల నిర్మాణానికి కలెక్టర్ అనుమతి అక్కర్లేదు: కేసీఆర్ - Sakshi

స్వేచ్ఛా తెలంగాణలో జెండా ఎగరేయడం ఆనందంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కలెక్టర్ల అనుమతి లేకుండానే ఇకపై చర్చిల నిర్మాణం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. 68వ స్వాతంత్ర్య వేడుకలు సందర్భంగా గోల్కొండ కోటలో మువ్వన్నెల జెండా ఎగరేసిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. ముందుగా ఆయన  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సైనిక వీరులకు నివాళులు అర్పించారు. గోల్కొండ కోటలో రాణిమహల్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఆయన అన్నారు. 500 జనాభా పైబడ్డ గిరిజన తండాలన్నీ ఇకపై పంచాయతీలుగా మారుతాయని చెప్పారు.

Advertisement
Advertisement