‘కరుణ’ చూ(డా)పాలి.. | Sakshi
Sakshi News home page

‘కరుణ’ చూ(డా)పాలి..

Published Fri, Feb 20 2015 12:41 AM

not afford to finance

చిన్నతనంలోనే అమ్మ మృత్యుఒడికి చేరింది.. ఆర్థికస్థోమత లేని నాన్న ఆ చిన్నారిని మరొకరికి దత్తత ఇచ్చాడు.. పెద్దయ్యాక ఆ యువకుడు సేవా గుణంతో రెండు కాళ్లు చచ్చుబడిపోరుున అమ్మాయిని ఆదర్శ వివాహం చేసుకున్నాడు.. అతడే నర్సంపేటకు చెందిన విజయ్‌కుమార్. పెళ్లి సమయంలో అధికారులు స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు.. వందల సార్లు కార్యాలయూల చుట్టూ తిరిగినా ఫలితం లేదు.. ఈయన గురువారం నర్సంపేట ఆర్డీవో కార్యాలయూనికి కాళ్లు చచ్చు బడిపోరుున భార్యను, ఒడిలో నెల పసిగుడ్డును ఎత్తుకుని వచ్చాడు. కలెక్టర్ కరుణ దయతలచి స్థలం, పనిచేసుకోవడానికి రూ.75 వేల రుణం ఇప్పించాలని వేడుకుంటున్నాడు..
 
నర్సంపేట : రెండు చేతుల్లో భార్య.. ఆమె చేతిలో బిడ్డతో 43సార్లు కలెక్టరేట్‌కు. అన్నిసార్లూ దరఖాస్తు చేశాడు. ఇంతకంటే ఎక్కువసార్లు ఆర్డీఓ కార్యాలయంలో అర్జీలు ఇచ్చాడు. ఇదంతా గుంట జాగ కోసం. అదీ.. అధికారులు ఇచ్చిన హామీనే. ఆదర్శ వివాహం చేసుకున్న యువకుడి పాట్లు ఇవీ. రఘునాథ పల్లి మండలం ఇబ్రహీంపురానికి చెందిన పబ్బ విజయ్‌కుమార్ నర్సంపేటలోని వూధన్నపేట రోడ్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఈయన తల్లి బాల్యంలోనే చనిపోరుుంది. వేరొకరికి దత్తత ఇచ్చి తండ్రి దూరమయ్యూడు.  విజయ్‌కుమార్‌కు గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్‌వాసి భూక్య శారద పరిచయుమైంది. పుట్టుకతోనే ఈమె రెండు కాళ్లు చచ్చుబడిపోయూరుు. కాళ్లు రప్పించేందుకు విజయ్‌కుమార్ ఎంతో శ్రమకోర్చి ఆపరేషన్ చేరుుంచినా విజయవంతం కాలేదు. 

వీరి మధ్య ప్రేమ చిగురించింది. కుల, యుువజన సంఘాల బాధ్యులు, జేఏసీ నాయుకుల సమక్షంలో రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఇంటి స్థలం కోసం ఆర్డీఓ హామీ ఇచ్చారు. అప్పటి నుంచి భార్యతో సహా ఇలా కార్యాలయూల్లో దరఖాస్తు చేసుకుంటేనే ఉన్నాడు. ఎప్పుడూ ‘మళ్లీ దరఖాస్తు చేస్కో’ అనే సమాధానంతో ఏడాదిపాటు విసిగి పోయూడు. ఈ క్రమంలో నివాస స్థలం ఏర్పా టు కోసం గత కలెక్టర్ ఆదేశించారు.జాగా చూపించారే తప్ప పట్టా ఇవ్వలేదు.  కలెక్టర్ కరు ణ అరుునా కరుణించాలని విజయ్‌కుమార్ విజ ్ఞప్తి చేస్తున్నాడు. ‘నడవలేని భార్య, వూకు పుట్టిన బాబును వదిలి వేరే పనికి వెళ్లలేకపోతున్నా. నర్సంపేటలోని పోచవ్ముగుడి సమీపంలో చూపి ంచిన గుంట స్థలానికి హక్కుపత్రం ఇప్పించాలి. ఆదర్శ వివాహం చేసుకుంటే రూ. 75 వేల లోన్ ఇస్తారంటా. నాకు మంజూరు చేయనే లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
 
 

Advertisement
Advertisement