Sakshi News home page

అప్పు తీర్చే మార్గం కనిపించక..

Published Wed, Feb 3 2016 2:59 AM

అప్పు తీర్చే మార్గం కనిపించక..

 కలిసిరాని కాలానికి మరో రైతు బలయ్యాడు. అప్పుచేసి పెట్టుబడులు పెట్టి.. ఆరుగాలం శ్రమిం చినా దిగుబడి ఆశాజనకంగా రాలేదు..చేసిన అప్పులకు ఏటేటా వడ్డీ పెరిగిపోతుండడం.. అవి తీర్చే మార్గం కనిపించగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాంపల్లి మండలం  చామలపల్లి గ్రామనికి చెందిన రాసాల వెంకయ్య(54)వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న 9 ఎకరాల భూమిలో ఎక రం వరి, మిగతా భూమిలో పత్తి సాగుచేస్తున్నా డు. పెట్టుబడుల నిమిత్తం తెలిసిన వారి వద్ద రూ. 4లక్షల50వేల వరకు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితులకు దిగుబడి రాకపొవడంతో మనస్తాపానికి గురయ్యాడు.


అప్పు తీర్చే మార్గం కనిపించక మంగళవారం సాయంత్రం తన వ్యవసాయ భూమి వద్దే పురుగులమందు తాగాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బావి వద్ద కు వెళ్లి చూడగా బీడు భూమిలో అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. అతడిని వెంటనే 108 వాహనంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుం డగా మార్గమధ్యలో ప్రాణాలొదిలాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పురుగులమందు తాగి..

 నల్లగొండ క్రైం : నల్లగొండ మండలం బుద్దారం గ్రామానికి చెందిన చిలుకల రామచంద్రయ్య (46) తనకున్న ఐదెకరాలలో పత్తి సాగు చేశాడు.పెట్టుబడుల కోసం * 6 లక్షల వరకు అప్పులు చేశాడు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడి రాలేదు. అప్పులు తీర్చే మార్గం కనిపించక మంగళవారం ఇంట్లో ఎవరూల లేని సమయంలో పురుగులమందు తాగాడు.  పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చిన కుమార్తెలు ఇంటి తలుపులు తీసి చూడగా తండ్రి అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. వెంటనే కూలికి వెళ్లిన తల్లి లక్ష్మమ్మకు సమాచారం అందించగా వచ్చి చూసే సరికి మృతిచెంది ఉన్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డానియల్ కుమార్ తెలిపార
 

Advertisement

తప్పక చదవండి

Advertisement