‘భూమి కొనుగోలు’కు అవినీతి చెదలు | Sakshi
Sakshi News home page

‘భూమి కొనుగోలు’కు అవినీతి చెదలు

Published Mon, Apr 20 2015 2:58 AM

Officers and staff on the role of the investigating

ఎస్సీ కార్పొరేషన్, రెవెన్యూ సిబ్బంది, దళారుల ఉమ్మడి దందా
మొత్తం కొనుగోళ్లపై ఆరా తీస్తున్న ఏసీబీ అధికారులు
అధికారులు, సిబ్బంది పాత్రపై ఆరా
ఏసీబీ ట్రాప్‌తో రెండు శాఖల్లో కలకలం

 
ఒకటి, రెండు రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి ..
ఒకటి, రెండు రోజుల్లో అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి. పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన బృహత్తర పథకంలో రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చేతి వాటం ప్రదర్శించడాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నాం. ఈ కుంభకోణంలో పెద్దల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు శాఖల అధికారులపై విచారణ కొనసాగుతుంది. అన్ని కోణాల్లో విచారణ చేపట్టాం. నిజాలు త్వరలో వెలుగు చూస్తాయి.
 - ‘సాక్షి’తో ఏసీబీ డీఎస్పీ సాయిబాబా
 
వరంగల్ క్రైం : బడుగు, బలహీన వర్గాలకు భూములు ఇవ్వాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూపంపిణీ పథకానికి అవినీతి చెదలు పట్టింది.  జిల్లావ్యాప్తంగా ఆయా గ్రా మాల్లో భూములను కొనుగోలు చేసి అక్కడి ని రుపేద దళితులకు పంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భూసేకరణ చేపట్టారు. జి ల్లాలో ఎస్సీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో 261 ఎకరాల 23 గుంటల సాగు భూములను ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో ఎకరానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు మాత్రమే చెల్లించాలని తొలుత నిర్ణయించారు.

అయితే ఈ ధరకు రైతులు భూములు అమ్మడానికి సిద్ధంగా లేరని సాకు  చెప్పి ప్రభుత్వానికి నివేదిక అందించి భూముల రేటును  రూ.5 లక్షల నుంచి 8 లక్షలు చేశారు. ఇప్పటి వరకు ఎస్సీ కార్పోరేషన్ కొనుగోలు చేసిన భూముల్లో స్థానిక మార్కెట్ ధర ప్రకారం రూ.3 లక్షలే ఎక్కువగా ఉన్నాయి. భూముల కొనుగోలు బాధ్యతను రెవెన్యూ, రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు అప్పగించడంతో అందివచ్చిన అవకాశాన్ని వారు తెలివిగా ఉపయోగించుకున్నారు.  

పహణీల్లో మార్పులకు లక్షల్లో వసూలు
రైతులు విక్రరుుంచే భూములు తమవే అరుునప్పటికీ కొన్ని సర్వే నంబర్లలో పహాణీల్లో తప్పులు దొర్లడం, వేరే వ్యక్తులు పేర్లు ఉండడం రెవెన్యూ అధికారులకు కలిసొచ్చింది. ప్రభుత్వానికి అమ్మేందుకు ఈ తప్పులు అడ్డంకిగా ఉండడంతో వారిని సరిచేసేందుకు కూడా స్థానిక వీఆర్వోలతోపాటు ఆపై రెవెన్యూ అధికారులు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నారుు.

దళారీ వ్యవస్థ కీలక పాత్ర..
భూముల కొనుగోలు పథకం చేపట్టగానే గ్రామాల్లో కొందరు రాజకీయ దళారులు రంగం మీదికి వచ్చారు. అటు రైతులు, ఇటు అధికారులతో అన్నీ తామై మాట్లాడుతూ ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించారు. ఎవరి వాటా ఎంతో ముందే తేల్చేశారు. అన్ని మాట్లాడుకున్నాకే ధర నిర్ణయూనికి వెళ్లారు. రైతుల భూములకు రేట్లు పెంచడం దగ్గరి నుంచి చెక్కులు అందేవరకు వీరి కనుసన్నల్లోనే వ్యవహారం మొత్తం నడుస్తున్నట్లు తెలిసింది.

ఇదే విషయమై ఆరు నెలల క్రితం జరిగిన ఒక సర్వసభ్య సమావేశంలో డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన ఓ జెడ్పీటీసీ తనకు తెలియకుండా గ్రామాల్లో భూములు కొనుగోలు చేస్తున్నారని, ప్రొటోకాల్ పాటించడం లేదని కలెక్టర్ ఎదుట వాపోయూరు. ఆ తర్వాత కూడా ఆయనకు కనీస సమాచారం లేకుండానే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మండలంలో భూముల కొనుగోలు జరగడం గమనార్హం. ఈ వ్యవహారంలో ఎస్సీ కార్పొరేషన్, రెవెన్యూ శాఖలకు, రైతులకు మధ్యవర్తులుగా వ్యవహరించిన కమీషన్లు తీసుకున్న దళారులపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించింది. వారిపై కూడా కేసులు నమోదు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

ఎస్సీ కార్పొరేషన్ దందాపై  ఏసీబీ అధికారుల సీరియస్..
ఇదిలా ఉండగా రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్వో ఏసీబీకి ట్రాప్ అయినప్పటికీ ఈ అవినీతి వ్యవహారంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారుల చేతివాటమే ఎక్కువగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఎస్సీ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఇందులో అన్నిస్థాయిల అధికారులకు వాటాలు ఉన్నట్లు గుర్తించారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి లబ్ధిదారులకు చెక్కులు అందాలంటే ప్రతీ చోట డబ్బులు వసూలు చేసున్నట్లు తెలుస్తోంది.

ఇలా జిల్లావ్యాప్తంగా భూసేకరణచేసిన ఆయా గ్రామాల నుంచి అవినీతిపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. పెద్దమొత్తంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఇందులో భాగస్వాములు అరుునట్లు తెలియడంతో ఏసీబీ అధికారులు మరింత లోతుగా కేసును పరిశోధిస్తున్నారు.

లబ్ధిదారుల ఎంపికలోనూ చేతివాటం..
ఎస్సీ కార్పొరేషన్ భూములు కేటాయించే అర్హుల జాబితా తయారీలో కూడా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గ్రామసభలు ఏర్పాటుచేసి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ పక్కదోవపడుతోంది. ఆయా గ్రామాల్లో డ బ్బులు ఇచ్చిన వారి పేర్లతో మాత్రమే లబ్ధిదారుల జాబితాను తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో రెవెన్యూ అధికారులతోపాటు సర్పంచ్‌వంటి నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల ఎంపిక జాబితాపై కూడా ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.

కొనుగోలు చేసిన భూములు ఇవే..
పర్వతగిరి మండలం వడ్లకొండలో 17 ఎకరాలు, శాయంపేట మండలం కాట్రపల్లిలో 80 ఎకరాల 30 గుంటలు, నర్మెట మండలం అమ్మాపూర్‌లో 10.7 ఎకరాలు, నర్సింహులపేట మండలం పెద్దముప్పారంలో 57 ఎకరాలు, వేములపల్లిలో 60 ఎకరాలు, పాలకుర్తి మండలం సిరిపన్నగూడెంలో 17.4 ఎకరాలు, ముత్తారంలో 24 ఎకరాలు, కొడకండ్ల మండలం పెద్దవంగరలో 34 ఎకరాల 20 గుంటలు సేకరించారు. మహబూబాబాద్ డివిజన్‌లోని ఒక గ్రామంలో కూడా రూ.3 లక్షలు పలికే భూమిని రూ.5 లక్షల 40 వేలుగా ధర నిర్ణయించారు. ఇదే డివిజన్‌లోని మరో గ్రామంలో కూడా మూడు లక్షలు ఎకరాకు ఉండగా మరో రెండు పెంచేసి వాటాలు నిర్ణయించుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement