పాలమూరు ప్రగతికి పెద్దపీట | Sakshi
Sakshi News home page

పాలమూరు ప్రగతికి పెద్దపీట

Published Sun, Nov 16 2014 1:50 AM

పాలమూరు ప్రగతికి పెద్దపీట - Sakshi

ప్రతి నియోజకవర్గంలో  కేజీ టు పీజీ సెంటర్
మండలానికో ‘గురుకులం’   మంజూరుకు కృషి
విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి హామీ

 
కొల్లాపూర్: వచ్చే ఐదేళ్లలో పాలమూరు జిల్లాను తెలంగాణలోనే అగ్ర గామిగా తీర్చిదిద్దుతామని విద్యాశాఖమంత్రి జి. జగదీశ్‌రెడ్డి హామీఇచ్చారు. జిల్లాపై తన కు పూర్తి అవగాహన ఉందని, ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా 85శాతం వ్యవసాయ యోగ్యమైన భూమి ఉందన్నారు.  శనివారం ఆయన కొల్లాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సభలో మంత్రి ప్రసంగించారు. జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే కృష్ణా, గుంటూరు జిల్లాల కన్నా పాలమూరు అభివృద్ధిలో ముందంజలో ఉంటుందన్నారు. కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే జూపల్లి వినతి మేరకు ఐటీఐ, పాల్‌టెక్నిక్ కళాశాలలు, మండలానికో గురుకుల పాఠశాల మంజూరుకు సీఎంతో మాట్లాడి వచ్చే విద్యాసంవత్సరంలో ప్రారంభించేందు కు కృషిచేస్తామన్నారు. కొల్లాపూర్ పీజీ సెంటర్‌లో వసతులు కల్పించి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంతభవనం నిర్మించేం దుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడు తూ.. పీజీ కళాశాల నిర్మాణానికి రూ.4.50కోట్లు మంజూరు చేయించానన్నారు. కొల్లాపూర్ నుంచి వనపర్తి, పెబ్బేరు వరకూ డబుల్‌లైన్ రహదారులు నిర్మించేందుకు కృషిచేస్తానన్నారు. మం త్రి పోచారం శ్రీనివాసరెడ్డిని కొల్లాపూర్ కు తీసుకొచ్చి ఈప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్, ఫిష్ ప్రాసెసింగ్, ఫ్రూట్ ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుకు కృషిచేస్తానన్నారు. పెబ్బేరులో మెడికల్ కాలేజీ, పెద్దకొత్తపల్లి మండల కేంద్రం సమీపంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
 
తెలంగాణపై చంద్రబాబు కుట్రలు


ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నారని  మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మనమే స్వయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటుంటే కృష్ణాబోర్డుకు తప్పుడు సమాచారమిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రా నాయకత్వాన్ని ఇక్కడ లేకుండా చేశామనే అక్కసుతోనే కుట్రలకు పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు.  

పీజీ కోర్సుల పెంపు: కొల్లాపూర్‌లో ప్రారంభించిన పీజీ సెంటర్లో వచ్చే ఏడాది కోర్సుల సంఖ్యను పెంచుతామని పీయూ వీసీ జి.భాగ్యనారాయణ వెల్లడించారు. ఈ ఏడాది పీజీ సెంటర్‌లో కేవలం మూడు కోర్సులు మాత్రమే ఏర్పాటుచేశామని, వచ్చే ఏడా ది అదనంగా  నాలుగు కోర్సులు ప్రారంభిస్తామని  చెప్పారు. పీయూ పరిధిలో రెండు పీజీ సెంటర్లు పనిచేస్తుండేవని, మూడో సెంటర్‌ను ప్రారంభించామన్నారు.

విద్యాభివృద్ధికి సహకరించాలి

 జిల్లాలో విద్యాభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ మంత్రి జగదీశ్‌రెడ్డిని కోరారు. కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో కూడా విద్యపరమైన అవకాశాలను మెరుగుపర్చాలని మాజీఎంపీ మందా జగన్నాథం కోరారు. నాణ్యమైన విద్యను అందించేందుకు, జిల్లాను  తీర్చిదిద్దేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement