నగర పంచాయతీగా దుబ్బాకను కొనసాగించాలి | Sakshi
Sakshi News home page

నగర పంచాయతీగా దుబ్బాకను కొనసాగించాలి

Published Thu, Jul 3 2014 4:16 AM

నగర పంచాయతీగా దుబ్బాకను కొనసాగించాలి

 పంచాయతీ కార్మికుల ర్యాలీ, రాస్తారోకో
 
దుబ్బాక రూరల్: రద్దు చేసిన దుబ్బాక నగర పంచాయతీని ప్రభుత్వం కొనసాగించాలని నగర పంచాయతీ కార్మిక నాయకుడు రామస్వామి డిమాండ్ చేశారు. దుబ్బాక నగర పంచాయతీని పునరుద్ధరించాలని కోరు తూ బుధవారం కార్మికులు, వివిధ శాఖల సిబ్బంది ర్యాలీగా వెళ్లి బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు.

అనంతరం తహశీల్ కార్యాలయం వద్దకు వెళ్లి తహశీల్దార్ లక్ష్మణ్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ దుబ్బాక పంచాయతీలో 1980 సంవత్సరం నుంచి కొందరు 1989సంవత్సరం నుంచి మరికొందరు పనిచేస్తున్నారని, వీరు రూ. 500ల నుంచి రూ.3000 వేల మధ్య వేతనాలతో పనిచేస్తూ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.  
 
నగర పంచాయతీలో విలీనమైన నాటినుంచి దుంపలపల్లి, ధర్మాజీపేట, చేర్వాపూర్, చెల్లాపూర్, మల్లాయిపల్లి, లచ్చపేట గ్రామాలకు చెందిన కార్మికులు సుమారు 80 మంది ఇక్కడ పనిచేస్తున్నారన్నారు. వారికి ఇప్పుడు కనీస వేతనాలు చెల్లిస్తున్నారన్నారు. దుబ్బాక నగర పంచాయతీ రద్దు చేస్తు కోర్టు తీర్పు ఇవ్వడంతో మళ్లీ తమ వేతనాలు తగ్గుతాయనే ఆందోళనలో ఉన్నారన్నారు.  కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దుబ్బాకను నగర పంచాయతీగా కొనసాగిం చాలని కోరారు. అనంతరం తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ఎల్లారెడ్డి, స్వామి, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement