అడ్డు తొలగించుకునేందుకే హత్య | Sakshi
Sakshi News home page

అడ్డు తొలగించుకునేందుకే హత్య

Published Tue, Apr 5 2016 2:30 AM

అడ్డు తొలగించుకునేందుకే హత్య - Sakshi

వివాహేతర సంబంధమేకారణం
ఇద్దరు నిందితుల అరెస్టు
8 రోజుల్లో కేసును ఛేదించిన  పోలీసులు
 

కోస్గి(కరీంనగర్) : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు కలిసి చంపేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఎట్టకేలకు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాం డ్‌కు తరలించారు. ఈ వివరాలను సోమవారం కోస్గి పోలీస్‌స్టేషన్‌లో కొడంగల్ సీఐ విశ్వప్రసాద్ వెల్లడించారు. బొంరాస్‌పేట మండలం దుద్యాలకు చెందిన సురేష్ (32)కు ముగ్గురు భార్యలు. కాగా మొదటి ఇద్దరితో తెగతెంపులు చేసుకుని రంగారెడ్డి జిల్లా యాలాల మండలం జక్కపల్లికి చెందిన బసంతను మూడో పెళ్లి  చేసుకున్నాడు. ఈమెకు అదే మండలం సంగెం వాసి రవీందర్‌తో వివాహేతర సంబంధం ఉండేది.

భర్తకు ఈ విషయం తెలిసినప్పటికీ అతడితో స్నేహం కొనసాగించాడు. నెల రోజుల క్రితం బసంత కాన్పు కోసం స్వగ్రామానికి వెళ్లింది. ఈ నేపథ్యంలో తన బైక్‌ను ఫైనాన్స్ వారు తీసుకెళ్లారని, రూ.25 వేలు కావాలని రవీందర్‌కు ఫోన్ చేశా డు. డబ్బులు లేవని చెప్పడంతో వివాహేతర సంబంధం ప్రస్తావిస్తూ భార్యను వదిలిపెడతానని, కేసు పెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించి అదే గ్రామానికి చెందిన బాబాయి హన్మంతు తో కలిసి రవీందర్ పథకం పన్నాడు. ఇందులోభాగంగానే గత నెల 26 వ తేదీ రాత్రి 11 గంట లకు ఫోన్ చేసి రప్పించి బైక్‌పై ఎక్కించుకుని కోస్గికి వచ్చి మద్యం తాగి తోగాపూర్ సమీపంలోకి తీసుకెళ్లి గొడవకు దిగారు. మాటామాట పెరగడంతో కర్రలతో తీవ్రంగా కొట్టి చంపేసి పారిపోయారు.
 
తీగలాగితే డొంక కదిలింది ఇలా...
మరుసటిరోజు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంఘటన స్థలంలో దొరికిన సెల్‌ఫోన్, మద్యం బాటిల్, ధ్వంసమైన బైక్ ఆధారంగా ఎనిమిది రోజుల్లోనే మిస్టరీ ఛేదించారు. సురేష్ సెల్ ఫోన్‌లో నంబర్ల ఆధారంగా విచారణ జరిపి చివరకు ఇద్దరు నిందితులను సోమవారం పట్టుకున్నారు. ఎస్‌ఐ మల్లారెడ్డి, కానిస్టేబుళ్లు రాజునాయక్, శ్రీనివాస్, చంద్రశేఖర్‌లను సీఐ అభినందించారు.
 

Advertisement
Advertisement