పట్టభద్రుల ఓటర్లు..85,974 | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల ఓటర్లు..85,974

Published Sat, Jan 17 2015 3:51 AM

PastapadreVoters ..85,974

 పట్టభద్రుల ఓటర్లు..
 జిల్లాపేరు    పురుషులు    మహిళలు    ఇతరులు    మొత్తం
 వరంగల్    72,138    25,307    3    97,448
 నల్లగొండ    64,719    21,249    6    85,974
 ఖమ్మం    55,911    23,246    3    23,246
 
 నల్లగొండ : పట్టభద్రుల ఓటర్లు జాబితా అధికారికంగా జారీ అయ్యింది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితాను శుక్రవారం జిల్లా యంత్రాంగం అధికారికంగా ప్రకటి ంచింది. ఈ మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 2,62,582 మంది ఓటర్లు తేలారు. దీంట్లో పురుషులు 1,92,768 మంది, స్త్రీలు 69,802, ఇతరులు 12 మంది ఉన్నారు. కాగా అత్యధిక ఓటర్లు వరంగల్ జిల్లాలో 97,448 మంది ఉండగా, రెండో స్థానంలో నల్లగొండ జిల్లాలో 85,974, తృతీయ స్థానంలో ఖమ్మం జిల్లాలో 79,160 మంది ఓటర్లు ఉన్నారు. 2008 ఓటర్లు జాబితా ప్రకారం మూడు జిల్లాలో కలిపి మొత్తం 1,33,825 మంది పట్టభద్రుల ఓటరు జాబితాలో నమోదై ఉన్నారు.
 
 కాగా ఈ ఏడాది మార్చి నాటికి పట్టభద్రుల నియోజకవర్గ స్థానం ఖాళీ అవుతున్నందున వచ్చే నెలాఖరున ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. దీని దృష్ట్యా ఎన్నికల సంఘం కొత్తగా ఓటరు నమోదు ప్రక్రియను పూర్తిచేసింది. దీంతో కొత్తగా 1,34,563 మంది ఓటర్లు పట్టభద్రుల జాబితాలో నమోదయ్యారు. పాత (2008), కొత్త ఓటర్లు(2015) కలిపి మొత్తం 2,68,388 మందికి గాను వివిధ కారణాల దృష్ట్యా 5,806 మంది ఓటుహక్కును తిరస్కరించారు. ఇవిపోగా 2,62,5 82 మంది పట్టభద్రుల ఓటర్లుగా అర్హత సాధించారు.
 
 గుర్తింపు కార్డులకు ఫొటోల సేకరణ...
 2008 ఓటరు జాబితాలో కొందరికి మాత్రమే ఫొటో గుర్తింపుకార్డులు వచ్చాయి. 2,62,582 మంది ఓటర్లుకుగాను 1,71,924 మంది ఓటర్ల ఫొటోలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 90,658 మంది ఓటర్లుకు గుర్తింపు కార్డులు లేవు. కాగా ప్రస్తుతం ఫొటోలు లేని ఓటర్లు తహసీల్దారు కార్యాలయంలో ఫొటోలు సమర్పించాల్సి ఉంటుంది. ఫొటోల సేకరణ ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. ఎన్నికల నాటికి వీటి సేకరణ పూర్తిచేయడంతోపాటు, ఓటర్లందరికీ గుర్తింపుకార్డులు జారీ చే యాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
 

Advertisement
Advertisement