మట్టి గణపతికి జైకొడదాం.. | Sakshi
Sakshi News home page

మట్టి గణపతికి జైకొడదాం..

Published Wed, Sep 12 2018 8:45 AM

PCB Distribute Clay Ganesh Statues In Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌ సిటీలో జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాలను ఈసారి పర్యావరణ హితంగా జరపుకోవాలన్న స్పృహ అన్ని వర్గాల్లో పెరిగింది. గురువారం వేడుకలకు మట్టి గణపతి విగ్రహాల పంపిణీకి పీసీబీ ఏర్పాట్లు చేసింది. మహానగరంలో కాలుష్య ఆనవాళ్లు లేకుండా చూసేందుకు ఈసారి సుమారు 2 లక్షల మట్టి వినాయక ప్రతిమల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు పీసీబీ సభ్య కార్యదర్శి సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఇందులో 8 అంగుళాలు మొదలు 18 అంగుళాల పరిమాణంలో తయారు చేసిన ప్రతిమలున్నాయి. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సహజ రంగులతో వీటిని తీర్చిదిద్దామన్నారు. చిన్న ప్రతిమలను జీహెచ్‌ఎంసీ పరిధిలోని 6 జోన్లలో 26 కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. హైకోర్టు, సచివాలయంలో కూడా విగ్రహాల పంపిణీ ఉంటుందన్నారు. ఇదిగాక హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మరో 40 వేల మట్టి ప్రతిమల పంపిణీకి శ్రీకారం చుట్టడం విశేషం. 

పీసీబీ ఉచిత మట్టిగణపతులను పంపిణీ కేంద్రాలివీ..
గణేష్‌ టెంపుల్, వైఎంసీఏ, సికింద్రాబాద్‌
అమీర్‌పేట్, సత్యం థియేటర్‌
కోఠి ఉమెన్స్‌ కాలేజ్‌
మెహిదీపట్నం రైతు బజార్‌ బస్టాప్‌
ఉప్పల్‌ ఎక్స్‌రోడ్, పోలీస్‌స్టేషన్‌ సమీపంలో
ఎల్బీనగర్, నాగోల్‌ చౌరస్తా
కూకట్‌పల్లి జేఎన్‌టీయూ
జీడిమెట్ల రైతుబజార్‌
బాలానగర్‌ బీవీ ఆస్పత్రి
సుచిత్ర క్రాస్‌రోడ్స్‌
హైకోర్టు, ఇన్‌కంట్యాక్స్‌ ఆఫీస్‌
రామచంద్రాపురం పీసీబీ కార్యాలయం
బొల్లారం కెన్నడీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌

విగ్రహాల పంపిణీ చేసే జీహెచ్‌ఎంసీ క్షేత్రస్థాయి కార్యాలయాలు..  
ఎల్బీనగర్‌ జోన్‌: కాప్రా, ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్‌ సర్కిల్స్‌
చార్మినార్‌జోన్‌: మలక్‌పేట్, సనత్‌నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్‌ సర్కిల్స్‌
ఖైరతాబాద్‌ జోన్‌: బల్కంపేట్‌ వార్డు ఆఫీస్, ఖైరతాబాద్‌ వార్డ్‌ ఆఫీస్, కుందన్‌బాగ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ కాలనీ
కూకట్‌పల్లి జోన్‌: మూసాపేట్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్‌ సర్కిల్స్‌
సికింద్రాబాద్‌ జోన్‌: బేగంపేట్, సికింద్రాబాద్‌ సర్కిల్స్‌
శేరిలింగంపల్లి జోన్‌: పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, చందానగర్‌ (పీజేఆర్‌ స్టేడియం),యూసుఫ్‌గూడ

హెచ్‌ఎండీఏ పంపిణీ కేంద్రాలు
పర్యవరణ హితంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో తయారు చేసిన 40 వేల మట్టి గణపతుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే మట్టి గణపతికి జై కొడుతున్న వివిధ స్వచ్ఛంద సంస్థలకు విగ్రహాలను పంపిణీ చేసిన హెచ్‌ఎండీఏ.. ఇప్పుడు వ్యక్తిగతంగా కావాల్సిన వారికి అందించేందుకు ఏర్పాట్లు చేసింది. లుంబినీ పార్కులో 5 వేలు, అమీర్‌పేట మైత్రీవనం కాంప్లెక్స్‌లో 3 వేలు, తార్నాకలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో 4 వేలు, సరూర్‌నగర్‌లోని ప్రియదర్శిని పార్క్‌లో 2 వేలు, వనస్థలిపురం ఫేజ్‌–5 రాజీవ్‌ గాంధీ పార్క్‌లో 5 వేలు, నారాయణగూడలోని డాక్టర్‌ మెల్కొటే పార్కులో 2 వేల విగ్రహలను పంపిణీ చేయనున్నారు. ప్రతిమలు కావాల్సిన వారు ఆయా ప్రాంతాలకు వెళ్లి తీసుకోవచ్చని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement