అప్పుల ఖాతాకు ‘ఆసరా’ నిజమే! | Sakshi
Sakshi News home page

అప్పుల ఖాతాకు ‘ఆసరా’ నిజమే!

Published Sat, Mar 4 2017 12:30 AM

అప్పుల ఖాతాకు ‘ఆసరా’ నిజమే!

డీఆర్‌డీవో అధికారుల విచారణలో వెల్లడి

నారాయణపేట: ఆసరా పింఛన్‌ డబ్బులను అప్పుల కింద జమ చేసుకుంటున్నది నిజమేనని అధికారుల విచారణలో తేలింది. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట మండలం కోటకొండ ఎస్‌బీహెచ్‌లో ఆసరా డబ్బులను అప్పుల కింద తీసుకుంటున్న వైనంపై ఈ నెల ఒకటో తేదీన ‘అయ్యో ఆసరా.. ఇదేమి గోస రా? శీర్షికతో ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురి తమైన కథనానికి చీఫ్‌ సెక్రటరీ స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని మహబూబ్‌నగర్‌ జిల్లా అధికారులను ఆదేశిం చారు. ఈ మేరకు డీఆర్‌డీవో అధికారుల బృం దం శుక్రవారం కోటకొండ ఎస్‌బీహెచ్‌లో విచారణ చేపట్టింది. ‘పట్నం చిన్న ఆశప్పకు చెందిన రూ.2 వేల పింఛన్‌ డబ్బులు బంగారు రుణం వడ్డీ కింద జమ చేసుకున్నట్లు రుజువైంది.

అలాగే, చిన్న లక్ష్మప్పకు చెందిన  డబ్బులు ఆయన కుమారుడి సీసీలోన్‌లో రూ. 500 జమ చేశారు. బాలప్పకు చెందిన రూ.3 వేలను ఆయన భార్య వెంకటమ్మ రుణం కింద జమ చేసుకున్నట్లు తేలింది. కాగా, అధికారులు విచారణ కోసం వచ్చారని తెలుసుకున్న పలువురు పింఛన్‌దారులు డీఆర్‌డీఓ ఏపీఓ శారద ముం దు తమ గోడును వెలిబుచ్చారు. మరో పింఛన్‌ దారు నర్సమ్మకు చెందిన డబ్బులు రెండు నెలల క్రితం బంగారు రుణం వడ్డీ కింద రూ.1300  బదిలీ అయినట్లు తేలింది. తన కొడుకు పేరిట ఉన్న సీసీలోన్‌ కోసం  నెలా రూ.500 జమ చేసినట్లు  అధికారుల ముందు వాపోయింది. మరో వితంతు భాగ్య మ్మ తన కుమార్తె పేరిట సీసీలోన్‌ ఉండడంతో 5 నెలలుగా వెయ్యి రూపాయల చొప్పున పింఛన్‌ డబ్బులను జమ చేశారని చెప్పుకొచ్చారు.  

ఇకపై పింఛన్‌ డబ్బులు పట్టుకోం: మేనేజర్‌
ఇక నుంచి పింఛన్‌దారుల డబ్బులను తాము పట్టుకోమని బ్యాంక్‌ మేనేజర్‌ మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. బ్యాంకు నుంచి రుణాలు పొం దిన వారు రెగ్యులర్‌గా డబ్బులు కట్టాలని,  లేకుంటే బ్యాంకు నిబంధనల ప్రకారం వసూ లు చేస్తామన్నారు. పింఛన్‌దారుల నుంచి బలవంతంగా డబ్బులను వసూలు చేయడం లేదన్నారు. పింఛన్‌ డబ్బులు రుణాల ఖాతా లో జమ చేసినట్లు స్టేట్‌మెంట్‌లో చూపిస్తుంది కదా అని అధికారులు మేనేజర్‌ను ప్రశ్నించడంతో ఆయన కంగుతిన్నారు. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుం టామని సమాధానమిచ్చారు.

పింఛన్‌ డబ్బు కొంత ట్రాన్స్‌ఫర్‌ అయింది నిజమే: ఏపీవో
వృద్ధులు, వికలాంగులు, వితం తువులకు అండగా ఉండాలన్న ఉద్దేశం తో ప్రభుత్వం ఆసరా పింఛన్‌ డబ్బులు అందజేస్తోందని డీఆర్‌డీవో ఏపీవో శారద పేర్కొన్నారు. బ్యాంకులో వారి కుటుంబ సభ్యులు చేసే అప్పులకు పింఛన్‌ను ముడిపెట్టడం సరికాదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోటకొండలోని లబ్ధిదారులు, బ్యాంకు అధికారులతో విచారణ చేపట్టామని,  అందులో ఇద్దరికి  సంబంధించిన పింఛన్‌ డబ్బులు కొంత వారి కుటుంబ సభ్యుల రుణాలకు ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు రుజువైందన్నారు. ఆసరా డబ్బులు డబ్బులు ఇకపై రుణాలకు లింకు పెట్టరని ఆమె స్పష్టం చేశారు.

Advertisement
Advertisement