బిగ్‌బాస్‌ ప్రసారం నిలిపివేయాలి

17 Jul, 2019 01:27 IST|Sakshi

హైకోర్టులో పిల్‌ దాఖలు

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు స్టార్‌ మా టీవీ రియాల్టీ షో బిగ్‌బాస్‌–3 సెన్సార్‌ లేకుండా ప్రసారం అవుతుందని.. పిల్లలు, యువత, మహిళల్ని తప్పుదోవ పట్టించేలా ఉండే ఈ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టులో ఈ పిల్‌ దాఖలు చేశారు. ఇప్పటికే బిగ్‌బాస్‌–3 షో నిర్వాహకులపై రాయదుర్గం, బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ నెల 21 నుంచి ప్రసారం కాబోయే బిగ్‌బాస్‌–3ని నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు. వంద రోజులు ఒకే ఇంట్లో అందరూ ఉంటారని, కెమెరాల చిత్రీకరణలో రికార్డు అయ్యే విషయాలను ప్రసారం చేస్తారని, పలువురిని ఆకట్టుకునేందుకు దురుసుగా, అసభ్యంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.  

పోలీస్‌ కేసుల్ని కొట్టేయండి: నిర్వాహకులు  
బిగ్‌బాస్‌–3 షో కోఆర్డినేషన్‌ టీం కూడా హైకోర్టును ఆశ్రయించింది. రాయదుర్గం, బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లల్లో నమోదైన కేసుల్ని కొట్టివేయాలని కోరుతూ మంగళవారం క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా పోలీసులకు తప్పుడు సమాచారంతో ఫిర్యాదు చేశారని, వాటిని కొట్టేయాలని బిగ్‌బాస్‌ కార్యక్రమ నిర్వాహకుడు అభిషేక్‌ ముఖర్జీ పిటిషన్‌ను దాఖలు చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మున్సిపల్‌ ఓటర్ల జాబితా సిద్ధం

స్పెషలిస్టులు ఊస్టింగే?

‘కిసాన్‌ సమ్మాన్‌’తో రైతులకు అవమానమే

నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

కాళేశ్వరం.. తెలంగాణకు వరం

అతడి పేరు డ డ.. తండ్రి పేరు హ హ...

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

పాత నోట్లు.. కొత్త పాట్లు!

ధర్మాధికారి నిర్ణయంపై అప్పీల్‌కు అవకాశం

‘విద్యుత్‌’పై ఎల్‌సీ వద్దు 

దోస్త్‌ ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ

మానసిక రోగులకు హాఫ్‌వే హోంలు! 

నిధుల సమీకరణపై దృష్టి!

పోలీసు శాఖలో బదిలీలకు కసరత్తు 

పీఎం–కిసాన్‌కు 34.51 లక్షల మంది రైతులు 

అయితే డొక్కు.. లేదా తుక్కు!

ట్రాఫిక్‌ చిక్కులూ లెక్కేస్తారు!

మన్ను.. మన్నిక ఇక్రిశాట్‌ చెప్పునిక!

ఎక్కడికైనా బదిలీ!

ఈనాటి ముఖ్యాంశాలు

గ్రహణం రోజున ఆ ఆలయం తెరిచే ఉంటుంది

టిక్‌ టాక్‌ వీడియోలు.. వారిని సస్పెండ్‌ చేయలేదు!

గాలిలో విమానం చక్కర్లు.. భయభ్రాంతులు

చందానగర్ పీఎస్‌ను ఆదర్శంగా తీసుకోండి

150 మంది చిన్నారులకు విముక్తి​

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేది మేమే’’

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

ఏటీఎం దొంగలు దొరికారు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌