తెలంగాణలో యూరియా కొరత వాస్తవమే | Sakshi
Sakshi News home page

తెలంగాణలో యూరియా కొరత వాస్తవమే

Published Tue, Sep 23 2014 1:39 PM

తెలంగాణలో యూరియా కొరత వాస్తవమే - Sakshi

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ప్రతి రైతుకు ఉన్న రుణంలో 25 శాతం ప్రభుత్వం... బ్యాంకర్లకు చెల్లిస్తుందన్నారు. తెలంగాణ జిల్లాల్లో యూరియా కొరత ఉన్నమాట వాస్తవమేనని పోచారం అంగీకరించారు. 

 

వర్షాలు బాగా పడటం వల్ల యూరియాకు డిమాండ్ పెరిగిందన్నారు. కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని....అయినా రైతులు భయపడాల్సిన అవసరం లేదని పోచారం అన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement