రాజకీయం అంటే వ్యాపారం కాదు  | Sakshi
Sakshi News home page

రాజకీయం అంటే వ్యాపారం కాదు 

Published Sat, Nov 24 2018 10:03 AM

 Politics Is Not A Business Only Service - Sakshi

సాక్షి, నారాయణపేట రూరల్‌: సేవా భావంతో చేయా ల్సిన రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్న నాయకులకు రాబోవు ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని బీజేపీ అభ్యర్థి కొత్తకాపు రతంగపాండురెడ్డి అన్నారు. కోయిలకొండ, ధన్వాడ మండల కేంద్రాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి అభంగాపూర్‌లో రోడ్‌ షో నిర్వహించారు.

వ్యాపారాలకు అలవాటు పడిన నాయకులు రాజకీయాల్లోకి వస్తే ఓట్లను నోటుతో కొని గెలిస్తే ఖజానా నింపుకోవడానికే చూస్తారని విమర్శిం చారు. కేంద్ర నిధులతో రాష్ట్రంలో పథకాలను రూపొందించి తానే ఇస్తున్నానని పబ్లిసిటి చేసుకోవడం సరికాదన్నారు.  


కోయిలకొండ: మండల కేంద్రంతో పాటు కొత్లాబాద్‌లో బీజేపీ ఇంటింటి ప్రచారం చేపట్టింది. కరపత్రాలు పంపిణీ చేస్తూ కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వెంకట్రామారెడ్డి, కెంచె శ్రీనివాస్, రాములు, శ్రీధర్, వేణు, గోపాల్, గడ్డం రాములు, గోవింద్‌నాయక్, సత్యనారాయణ పాల్గొన్నారు. 


ధన్వాడ: నియోజకవర్గ ప్రజల సేవ చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని ఎమ్మేల్యే అభ్యర్థి రతంగ్‌పాండ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఒక్క హామీ నెరవేర్చకుండా మళ్లీ హామీల వర్షం కురిపిస్తున్న టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించాలన్నారు. అయన చేసిన అభివృద్ధి అంత కేవలం కారపత్రలలోనే ఉన్నయన్నారు.

తనను గెలిపిస్తే నారాయణపేటను జిల్లా చేసేందకు కృషి చేస్తానాని అలగే 69 జీవోను అమలు చేసి జాయమ్మ చేరువుకు ఎత్తిపోతల నుంచి నీరు అందిస్తామని అన్నారు. అధ్యక్షుడు మాకం సురేందర్, వైస్‌ఎంపీపీ రాంచంద్రయ్య, ఉదయబాను, గోవర్ధన్‌గౌడ్, ఉమేష్, శ్రీనివాస్‌గౌడ్, మల్లయ్య పాల్గొన్నారు.

 
మరికల్‌: వ్యవసాయ పొలాల వద్ద కూలీ పనులు చేస్తున్న వారి వద్దకు వెళ్లి బీజేపీ నాయకులు వినూత్న ప్రచారం నిర్వహించారు. మరికల్‌లో శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ పొలాలకు వెళ్లి బీజేపీ అభ్యర్థి రతంగపాండురెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, కొండయ్య, రాజేష్, వేణు, వెంకటేష్, రమేష్, జానాకిరాములు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement