జలమే గరళమై..

5 Jul, 2018 10:56 IST|Sakshi
మృతులు దుర్వ సుజాత, దుర్వ గంగుబాయి

ఆ ఊళ్లో ఓ చేదబావి లేదు.. ఓ చేతిపంపూ లేదు.. తాగుదామంటూ గుక్కెడు మంచినీళ్లు కరువు.. గ్రామస్తులకు వ్యవసాయ బావే దిక్కు.. అన్ని అవసరాలకు అవే నీళ్లు.. ఆ జలం కలుషితమై.. ఆపై గరళమై జనం  ప్రాణాలను కాటేసింది. తాంసి మండలం అట్నంగూడలో కలుషిత నీటి కారణంగా అతిసారం ప్రబలింది. వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి చెందారు. మరో 11 మంది తీవ్ర అస్వస్థతతో ఆదిలాబాద్‌ రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. 

తాంసి(బోథ్‌): ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం గిరిగాం గ్రామ పంచాయతీ పరిధి అట్నంగూడలో అతిసారం ప్రబలింది. కలుషిత నీరుతాగి వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గుపై ఓ విద్యార్థిని, మరో వృద్ధురాలు మృతిచెందారు. 11 మంది అస్వస్థతకు గురై జిల్లా కేంద్రంలోని రి మ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రా మంలో తాగునీటి బావి లేదు. దీంతో గ్రామ స మీపంలో ఉన్న వ్యవసాయ బావిలోని కలుషిత నీటిని తాగుతున్నారు. ఈ కారణంగానే అస్వస్థత కు గురైనట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. మూ డు రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన త లాండె బాపురావు(60) వాంతులు, విరేచనాలతో మృతి చెందాడు. అతడు అనారోగ్యంతో మృతి చెందినట్లు భావించారు.

ఇదే క్రమంలో మంగళవారం గ్రామానికి చెందిన దుర్వ సుజాత(19), దుర్వ గంగుబాయి(60) వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని కుటుం బసభ్యులు రిమ్స్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా, సు జాత మార్గంమధ్యలో చనిపోయింది. గంగుబాయి ఆసుపత్రి చికిత్స పొందూతు మృతిచెం దింది. సుజాత మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గ్రామంలో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న తలండె జంగుబాయి(40), దుర్వ నిర్మలబాయి(45), పెందుర్‌ సీమ్‌(22), మడావి లక్ష్మి(26), అనక కౌసల్యబాయి(55)తో పాటు 11 మందిని ఆటోలు, 108ల ద్వా రా రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

జంగుబాయి పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు స్థానిక వై ద్య సిబ్బంది తెలిపారు. గ్రామంలో కనీసం బోరుబావి కూడా లేదని, దీంతో గ్రామ సమీపాన గల వ్యవసాయ బావి నీళ్లు తాగుతున్నామని గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలంలో కలుషిత బావినీరు తాగడంతోనే అతిసారం ప్రబలిందని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. అతిసారంతో ఇద్దరు మృతి చెందిన వెంటనే తాంసి, భీంపూర్‌ పీహెచ్‌సీల వై ద్యులు, సిబ్బంది గ్రామంలో తిరుగుతూ అతి సారం లక్షణాలున్నవారికి చికిత్స అందిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వ్యవసాయానికి 5 శాతం కేటాయింపులా?: రేవంత్‌ 

సిటీకి దూపైతాంది

‘ఐ లవ్‌ మై జాబ్‌’ 

ఎలక్ట్రిక్‌ బస్సు సిటీ గడప దాటదా?

24 నుంచి ఇంజనీరింగ్‌ చివరి దశ కౌన్సెలింగ్‌

‘పుర’ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం 

భాగ్యనగరానికి జపాన్‌ జంగల్‌

ఎన్నికలకు నో చెప్పిన హైకోర్టు

ఈనాటి ముఖ్యాంశాలు

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

హైదరాబాద్‌లో నీటికి ఢోకా లేదు..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

శ్రీచైతన్యలో పుడ్‌ పాయిజన్‌..40మందికి అస్వస్థత

సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారీ ఎన్‌కౌంటర్‌కు ప్లాన్‌

‘కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదు’

గ్రామాభివృద్ధికి సహకరించాలి :జిల్లా కలెక్టర్‌

‘నేను పార్టీ మారడం లేదు’

స్టూడెంట్‌ పోలీస్‌తో దురాచారాలకు చెక్‌!

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

‘విదేశీయుల’పై నజర్‌!

బాడీ బిల్డర్స్‌కు మంత్రి తనయుడి చేయూత

‘న్యాక్‌’ ఉండాల్సిందే!

గ్రేటర్‌లో నకిలీ పాలసీల దందా

వాహనం ఢీకొనడంతో.. అంధకారంలో 20 గ్రామాలు!

ఒకటా మూడా?

కలుషిత ఆహారం తిన్నందుకు....

పోలీస్‌ @ అప్‌డేట్‌

హైదరాబాద్‌కు 48 రోజులే నీళ్లు అందించగలరా?

హామీలను సీఎం నిలబెట్టుకోవాలి

సర్కారు బడికి.. సర్పంచ్‌ కుమార్తె..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌