ప్రభాకరా... పట్టించుకో.. | Sakshi
Sakshi News home page

ప్రభాకరా... పట్టించుకో..

Published Wed, Feb 25 2015 3:22 AM

Prabhakara mind ... ..

పార్లమెంటులో ప్రధాన నరేంద్రమోదీ సారథ్యంలో కొత్తగా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్..
 గతంలో ఎన్ని బడ్జెట్‌లు వచ్చినా జిల్లాకు ఒరిగింది శూన్యం.. కొత్త ప్రభుత్వం రూపొందించిన రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ప్రతి రైల్వే స్టేషన్లో పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఏళ్ల తరబడిగా ఉన్నారుు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ లేదు. రైళ్ల విస్తరణ, ఓవర్ బ్రిడ్జీలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణాలు లేనే లేవు. ఈ సారైనా జిల్లాకు న్యాయం జరుగుతుందా..? ఏళ్ల క్రితం సర్వే పూర్తయిన రైల్వే లైన్ల నిర్మాణ  పనులకు ఈసారి నిధులు విడుదలవుతాయూ..? కలగానే మిగిలిన బ్రిడ్జీల నిర్మాణానికి కేంద్రం నిధులిస్తుందా..? ఈ బడ్జెట్‌లోనైనా నిర్మాణ పనులుప్రారంభమవుతాయా..? ఏళ్లుగా ప్రయాణికులు కోరుకుంటున్న రైళ్ల హాల్టింగ్ డిమాండ్ ఇప్పుడైన నెరవేరతుందా..? ఇవీ జిల్లా ప్రజలు ఈనెల 26న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర రైల్వే బడ్జెట్‌పై పెట్టుకున్న గంపెడాశలు.    - సాక్షి, మంచిర్యాల      
 
 సాక్షి, మంచిర్యాల : జిల్లాలో ఆదిలాబాద్, బాసర, మంచిర్యాల, బెల్లంపల్లి, రవీంద్రఖని, మందమర్రి, ఆసిఫాబాద్ క్రాస్‌రోడ్డు, రేచిని రోడ్డు, కాగజ్‌నగర్, సిర్పూర్‌లలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరి ద్వారా రైల్వే నెలకు భారీ మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అయినా.. కేంద్రం మాత్రం జిల్లాలో రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు అత్యల్పం.
 
రైలుకు బ్రేక్ పడేనా..?
 జిల్లాలో పలు స్టేషన్లలో రైళ్ల నిలుపుదల కోసం ప్ర యాణికులు ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. తూర్పు జిల్లా ప్రజల సౌకర్యార్థం మంచిర్యాల రైల్వేస్టేషన్లో కేరళ, సంఘమిత్ర, స్వర్ణజయంతి, హిమసాగర్, రామేశ్వరం, నవయుగ ఎక్స్‌ప్రెస్, చెన్నై-జోద్‌పూర్ గుజ రాత్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ -భిక్కనూరు రాజస్థా న్ ఎక్స్‌ప్రెస్, విశాఖ-జోద్‌పూర్, విశాఖ-గాంధీనగర్ ఎక్స్‌ప్రెస్ మంచిర్యాల రైల్వే స్టేషన్లో నిలుపుదల చేయాలనే డిమాండ్ ఉంది. హైదరాబాద్-న్యూఢిల్లీ ‘దురంతో’ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను, నవజీవన్, గ్రాండ్ ట్రాక్ రైళ్లను బెల్లంపల్లి స్టేషన్లో నిలపాలనే డిమాండ్ ఉంది. మందమర్రి రైల్వేస్టేషన్లో తెలంగాణ , రామకృష్ణాపుర్‌లో జనతా ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్ ఇవ్వాలని రెండు దశాబ్దాలుగా స్థానిక ప్రజలు ఆం దోళన చేస్తూనే ఉన్నారు. ఆసిఫాబాద్ క్రాస్‌రోడ్డు రైల్వేస్టేషన్లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను, కాగజ్‌నగర్‌లో డెహ్రడూన్-చెన్నై సూపర్‌ఫాస్ట్, బాసర స్టేషన్లో హైదరాబాద్-అజ్మీర్, అమరావతి-తిరుపతి, ఓకా(తమిళనాడు)-రామేశ్వర్, జైపూర్-హైదరాబాద్, ఇండోర్-యశ్వంత్‌పూర్ రైళ్లను ఆపాలనే డిమాండ్ ఉంది.
 
రైళ్ల పొడిగింపు.. కొత్త లైన్లు..!
 షిర్డీ నుంచి బల్లార్ష వరకు నడుస్తున్న రైలును బెల్లంపల్లి వరకు పొడిగించాలనే డిమాండ్ ఉంది. బాసర నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మాబాద్ వ రకు నడుస్తున్న మరాఠ్వాడ ఎక్స్‌ప్రెస్‌ను బాసర వర కు పొడగించాలి. నాందేడ్-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఆది లాబాద్ మీదుగా నడిపించాలన్న డిమాండ్ ఉంది. మంచిర్యాల-జద్గల్‌పూర్ (మధ్యప్రదేశ్) వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించాలనే డిమాండ్ ఉంది. సికింద్రాబాద్ టు బాసర సింగిల్ లైన్ ఉండడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.  
 
కొత్త రైళ్ల డిమాండ్..
 బెల్లంపల్లి నుంచి కొత్తగూడెంకు కొత్తగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నడిపించాలి. కాజీపేట-సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు స్పెషల్ రైలు నడపాలి. బెల్లంపల్లి నుంచి తిరుపతి వరకు రైలు ఏర్పాటు చేస్తానని మాజీ ఎంపీ వివేకానంద హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో అదనపు భోగీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది.
 
రైళ్ల పునరుద్ధరణ
 పదకొండేళ్ల క్రితం కాగజ్‌నగర్ వరకు ఉన్న బుషావత్ (మహారాష్ట్ర) ప్యాసింజర్‌ను రద్దు చేసి.. బల్లార్షా వరకే పరిమితం చేశారు. దీంతో కాగజ్‌నగర్ నుంచి మహారాష్ట్రకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్యాసింజర్‌ను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. దక్షిణ భార తదేశంలోనే పేరొందిన బాసరలోని చదువుల తల్లి పుణ్యక్షేత్రానికి రోజూ వందలాది మంది రాకపోకలు సాగి స్తుంటారు. గతంలో హైదరాబాద్ నుంచి బాసర వర కు జ్ఞాన సరస్వతీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి.
 
కలగానే బ్రిడ్జీల నిర్మాణం..
     రోజూ మంచిర్యాల రైల్వేస్టేషన్ మీదుగా సుమా రు 30 రైళ్లు వెళ్తుంటాయి. ప్రతిసారీ స్టేషన్ సమీపంలోనే ఉన్న హమాలీవాడ ప్రాంతంలోని గేటు వేయడంతో వాహనాలు బారులు తీరుతున్నారుు. ఆ ప్రాంతంతోపాటు ఎంసీసీ ఫ్యాక్టరీ సమీపంలోనూ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం చేపట్టాలి.
     ఆదిలాబాద్ పట్టణంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి 2010లో రైల్వే అధికారులు సర్వే చేశారు. నిర్మాణానికి రూ.17 కోట్లు అవసరముంటాయని అంచనా వేశారు. సగం నిధులు రైల్వే, సగం డబ్బులు మున్సిపాలిటీ భరించాలని కేంద్రం సూచించింది. కానీ అన్ని నిధులు ఇవ్వలేమని ఆదిలాబాద్ పురపాలక సంఘం అధికారులు చేతులెత్తేయండతో సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది.
     ఆసిఫాబాద్ క్రాస్‌రోడ్డు, రేచినిరోడ్డు, బాసర రెల్వేస్టేషనో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మందమర్రిలో లోలెవల్‌లో ఉన్న ప్లాట్‌ఫారంను పెంచాలి.
 ప్రతిపాదనలకే పరిమితం..
     గత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మంచిర్యాల-ఆదిలాబాద్ నూతన రైలు మార్గాన్ని ప్రకటించినా ఇంత వరకు కనీసం సర్వే కూడా ప్రారంభంకాలేదు.
     2010-11 రైల్వే బడ్జెట్‌లో మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో డిస్పెన్సరీని ప్రతిపాదించినా ఇంత వరకు అమలుకు నోచుకోలేదు.
     ఆదిలాబాద్ నుంచి వయా నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డి మీదుగా హైదరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి 2010-11 బడ్జెట్ సమావేశాల్లోనే నిధులు మంజూరయ్యాయి. పనులకు సంబంధించి సర్వే కూడా పూర్తయినా పనులు ప్రారంభించలేదు.

Advertisement
Advertisement