పుష్కరాలా.. అంటే ఏమిటి? | Sakshi
Sakshi News home page

పుష్కరాలా.. అంటే ఏమిటి?

Published Sat, Jul 4 2015 12:55 AM

పుష్కరాలా.. అంటే ఏమిటి? - Sakshi

ఏళ్లకేళ్లుగా కొండలు, గుట్టలే వారి ఆవాసాలు. సంప్రదాయాలు.. కట్టుబాట్లే వారి ఆస్తిపాస్తులు. గోదావరి పరివాహకమే వారి  జీవనాధారం. కానీ, ప్రస్తుత గోదావరి పుష్కరాల సందడి వారి గూడేల్లో కన్పించడం లేదు. అసలామాటకొస్తే తమకు పుష్కరాలంటేనే తెలియదంటున్నారు గొత్తికోయలు.
 
ఏటూరునాగారం: ఏటూరునాగారం అభయారణ్యంలో సుమారు 3వేల మంది గొత్తికోయలు జీవిస్తున్నారు.  వీరు ఏడాదిలో రెండు సార్లు(పుష్యమాసం, వైశాఖ మాసం) తమ దేవతామూర్తులను గోదావరి నీటితో శుద్ధి చేస్తారు. అసలు తమకు పుష్కరాలు అంటే ఏమిటోతెలియదంటున్నారు . నాయకపోడ్‌లు తమ ఆడబిడ్డ అయిన లక్ష్మీదేవరను గోదావరి పుణ్యస్నానాలు ఆచరించి ఉత్సవా లు జరుపుకుంటారు. మడుగులోని నీటిని కూడా ఆదివాసీ గిరిజనులు పవిత్ర జలాలుగా భావిస్తారు.
 
ఎన్నో తెగలు.. భిన్న సంస్కృతులు
 ఏడు రాష్ట్రాల్లో విస్తరించిన గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎన్నో తెగలు, భిన్న సంస్కృతులతో జీవనం సాగిస్తున్నారుు. గోండ్, అంబుజ్ మేరి యా, బిస్నోమ్ మెరియ, మురియా, హల్పా, బట్రా, పజ్రా, గొత్తికోయ, కోయలు, మాంజీ, బంజారాలంబాడీ, నాయకపోడ్ తెగలు ఏజెన్సీలో జీవిస్తున్నాయి. ఒకప్పుడు వేట.. ప్రస్తుతం పోడు వ్యవసాయం వీరి కడుపు నింపుతోంది. వెదురుతో సృజానాత్మక వస్తువులు తయారు చేస్తారు.నాసిక్‌లో నివసించే వర్లితెగ గిరిజనులు రూపొందించే వర్లి చిత్రాలుగా ప్రసిద్ధి చెందాయి.
 
 ఇప్పటి వరకు ఎప్పుడు చేయలె
 పుష్కరాలకు స్నానాలు అంటే ఏమిటి? ఇప్పటి వరకు ఎప్పు డూ చేయలె. ఇక్కడికి వచ్చినకాడి నుంచి వాగులు, కుంటల్లోనే స్నానాలు చేస్తాం. సంక్రాంతి ముందు వడ్లు కోసేటప్పుడు పండుగ చేసుకొని గొర్రెలు, మేకలను బలిస్తాం. పొలిమేరల చుట్టూ నల్లటి ముగ్గు పోసి ఎవరు రాకుండా చూస్తాం.
 - మాడవి జోగయ్య, చింతలపాడు
 
 

Advertisement
Advertisement