ఆఫీసులపై జాతీయ జెండా | Sakshi
Sakshi News home page

ఆఫీసులపై జాతీయ జెండా

Published Mon, Jun 2 2014 3:46 AM

ఆఫీసులపై జాతీయ జెండా

 కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా  సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శర్మన్ అధికారులను ఆదేశిం చారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.  వేడుకల నిర్వాహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని శర్మన్ అధికారులకు సూచించారు.
 
 ప్రతి కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలకరించి, పండుగవాతావరణాన్ని నెలకొల్పేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఉదయం 8.30గంటల కల్లా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించా లన్నారు.  ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రజలందరికి తెలిసేలా ఘనంగా ఉండాలన్నారు.   కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అమరయ్య, నేతలు శివకుమార్, రాజేశ్వర్ గౌడ్, బురుజు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 వలసకూలీలకు  చెక్కులు పంపిణీ
 కర్ణాటక వలసకూలీలకు సంబంధించి రూ.13.79లక్షల చెక్కులను ఇన్‌చార్జి కలెక్టర్ శర్మన్ ఆదివారం తన చాంబర్‌లో అందజేశారు. వీరంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే అయినా, ప్రస్తుతం కొత్తకోటలో నివాసం ఉంటూ చిత్తూర్ జిల్లాలో ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీలో రోడ్డు పనులు చేయించుకొన్న తరువాత కంపెనీ వారికి వేతనాలు ఇవ్వలేదు. అయితే వీరు యూనియన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించగా కోర్టు కూలీల పక్షాన తీర్పునిస్తూ 32మంది కూలీలకు నూ.27లక్షలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. దీంతో వెంటనే కూలీలకు చెల్లించాల్సిన డబ్బులను యూజమాన్యం జిల్లా అధికారులకు అందజేయగా, ఆ చెక్కులను బాధితులకు అందజేశారు.  
 
 అమరుల త్యాగాల ఫలితం
 జెడ్పీసెంటర్: అమర వీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమై ందని ఇన్‌చార్జి కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు. ఆదివారం జిల్లా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చే సిన తె లంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ డిమాండ్ అనేది ఆరు శతాబ్దాల స్వప్నం సాకారమైందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని, వారి అనితరమైన త్యాగాలు చేశారని కొనియూడారు. నూతన రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల ని పిలుపునిచ్చారు.   కార్యక్రమంలో డీ ఆర్వో రాంకిషన్,  డీఆర్‌డీఏ పీడీ చంద్ర శేఖర్‌రెడ్డి, ఆర్‌డీఓ హనుమం తురావు, హరిత,గీత, అదికారులు ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement