డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు ప్రమాదం | Sakshi
Sakshi News home page

డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు ప్రమాదం

Published Sun, Jun 28 2015 12:52 AM

Raggle driver in bus accident

 ఖమ్మం రూరల్ :డ్రైవర్ నిర్లక్ష్యం ఆర్టీసీ బస్సు  ప్రమాదానికి కారణం కాగా కండక్టర్ ప్రా ణాలు కోల్పోయాడు.  23 మంది ప్రయూణికులు గాయపడ్డారు. ఖమ్మం రూరల్ మండలం చిన్నతండా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నారుు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ డిపోకు చెందిన బస్సు ఖమ్మం బస్టాండ్ నుంచి శనివారం సా యంత్రం నాలుగు గంటల సమయంలో సుమారు 50 ప్రయూణికులతో మహబూబాబాద్‌కు బయల్దేరింది. బస్సు చిన్నతండా నుంచి మౌలానా పెట్రోల్‌బంక్ దాటి ముత్తగూడెం వైపునకు మళ్లిన కొద్ది నిమిషాల్లోనే రోడ్డు పక్కన ఎండిపోయిన తాటిచెట్టు ను ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది.
 
 ప్రమాదం జరిగిన సమయం లో కండక్టర్ కందుకూరి ప్రసాద్(42) బస్సు వెనుకవైపు డోరు వద్ద టికెట్లు కొడుతున్నాడు. ప్రమాదాన్ని పసిగట్టిన వెంటనే భయంతో డోర్ నుంచి బయట కు దూకాడు. బస్సు కూడా కండక్టర్ దూకిన వైపే పల్టీ కొట్టడంతో దాని కిందపడి నలిగిపోయూడు. మృతుడు వరంగ ల్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొం డ గ్రామానికిచెందిన వాడు. బస్సులోని ప్రయాణికులు వరంగల్ జిల్లా నెల్లుకూరి మండలం నర్సింహుల గూడెంకు చెందిన గుగులోత్ భోజ్యా, మరిపెడ మండలం మంగోళివారిపాలెం నకు చెందిన బంటు ఉప్పలమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. భోజ్యాకు తొంటికాలు విరిగింది. ఉప్పలమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
 
 మిగతా ప్రయాణికులు గుగులోత్ గమి లి, అంబ్రాజు సైతమ్మ, బానోత్ చంద్ర మ్మ, పడిశాల పరుశురామ్, కల్లూరి పుల్ల య్య, కల్లూరి నిర్మల, బానోత్ అంబాలి, బానోత్ కాంతి, బానోత్ సరోజ, బానోత్ బాలి, కలకోట తిరుపమ్మ, బానోత్ రాజేశ్వరి, పునెం సుమిత్ర, పునెం లక్ష్మీ, పునెం బొర్రయ్య, బానోత్ చిన్న రాము లు, జక్కుల మల్లమ్మ, గంధసిరి కనకమ్మ, గంధసిరి వెంకటయ్య, పేర్ల అరు ణ, కాసాని రమేష్‌లకు కాళ్ళకు, చేతుల కు, తలకు గాయాలయ్యాయి. సమాచా రం అందుకున్న సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ గోపి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పోలీస్ వాహనాల్లో ఖ మ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఎండిన తాటిచెట్టు కారణంగా ఘోరప్రమాదం నుంచి తప్పించుకున్న ట్లు కొంతమంది ప్రయూణికులు తెలిపారు. బస్సు మొదట తాటి చెట్టును ఢీకొనడంతో వేగం తగ్గి నెమ్మదిగా పొలాల్లోకి వెళ్లింది.   పల్టీ కొట్టడంతో అందులోని ప్రయాణికు లు ఒక్కసారిగా ఒక వైపునకు ఒరిగిపోవడంతో వారికి బస్సులోని ఇనుప కడ్డీలు, బస్సు సీట్ల కడ్డీలు తగిలి గాయపడ్డారు.
 
 ఒక చేతిలో సిగరెట్..
 ఇదిలా ఉండగా ప్రమాదం జరిగిన సమయంలో బస్సు డ్రైవర్ ఒక చేత స్టీరింగ్ పట్టుకొని మరో చేత సిగరెట్ తాగినట్లు ప్రయాణికులు తెలిపారు.ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ కిటికీ లోంచి దూకి ఆటోలో  పారిపోరుునట్లు తెలిపారు.
 
 క్షతగాత్రుల్లో నిండు గర్భిణి
 వరంగల్ జిల్లా మరిపెడ మండలం మంగళగూడెంనకు చెందిన బానోత్ రాజేశ్వరి అనే నిండు గర్భిణి కూడా బస్సు ప్రమాదంలో గాయపడింది. వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం వచ్చి హాస్పిటల్‌లో చూపించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. రాజేశ్వరి ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంది. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వా సుపత్రిలో జెడ్పీ చైర్‌పర్సన్ గడిపెల్లి కవిత పరామర్శించారు.
 

Advertisement
Advertisement