Sakshi News home page

రైల్వే అధికారుల ఉరుకులు పరుగులు

Published Thu, Aug 4 2016 6:28 AM

రైల్వే అధికారుల ఉరుకులు పరుగులు - Sakshi

ప్రధానితో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు పర్యటన  
అభివృద్ధి పనులు సిద్ధం చేయాలని ఢిల్లీ నుంచి హుకుం
పాత హామీల్లో అమలుకాని వాటిని ప్రారంభించాలని అధికారుల నిర్ణయం
 

హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావటం అంటే ఇదే... ఉన్నట్టుండి రోజున్నర పాటు రైల్వేశాఖ మంత్రి హైదరాబాద్‌లో ఉండాల్సి రావటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులకు చిక్కులొచ్చి పడ్డాయి. అనుకోకుండా రైల్వేమంత్రి ఓ రాత్రి హైదరాబాద్‌లో ఉండాల్సి రావటంతో ఆయన కోసం కొత్తగా ‘అభివృద్ధి కార్యక్రమా’న్ని వెతుక్కోవాల్సిన అగత్యం అధికారులకు ఏర్పడింది. దీంతో ఇప్పటికిప్పుడు ఏం పనిని సిద్ధంచేయాలో తెలియక అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

ఈనెల 8న దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ సంఘ్ స్వర్ణోత్సవాల్లో రైల్వే మంత్రి పాల్గొనాలి. కానీ కేసీఆర్ విజ్ఞాపన మేరకు ఈ నెల 7న ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారు. ఆయన ప్రారంభోత్స వాల్లో సికింద్రాబాద్-సిద్దిపేట-కరీంనగర్  రైల్వేలైను శంకుస్థాపన కూడా ఉంది. దీంతో ప్రధాని వెంట రైల్వే మంత్రి కూడా ఆ రోజు రావాల్సి వచ్చిం ది. దీంతో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ఏర్పాటు చేయాల్సిందిగా ఢిల్లీ నుంచి అధికారులకు సమాచారం అందింది. దీంతో పాత హామీల్లో అమలుకాని వాటిని దుమ్ముదులిపి ప్రారంభించాలని నిర్ణయించారు.
 

Advertisement
Advertisement