'పోలీసు శాఖను పటిష్టం చేస్తాం' | Sakshi
Sakshi News home page

'పోలీసు శాఖను పటిష్టం చేస్తాం'

Published Sun, Dec 20 2015 2:30 PM

rajiv thrivedi comments on police recruitment

తాండూరు: పోలీసు శాఖలో కానిస్టేబుల్ నుంచి అన్ని కేటగిరీ ఉద్యోగాల భర్తీలో మూడేళ్ల వయో సడలింపు ఇవ్వనున్నట్టు తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది చెప్పారు. తన కుమారులతో కలసి ఆయన ఆదివారం సైకిల్‌పై హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా తాండూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా త్రివేది మాట్లాడుతూ... పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు. 2016లో తెలంగాణ పోలీసు శాఖలో సంస్కరణలు అమలు చేయనున్నట్టు చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా శాఖను పటిష్టం చేయనున్నామని పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement