'తెలంగాణకే తలమానికం ఆర్ఎఫ్‌సీఎల్'

26 Sep, 2019 19:02 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి: రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్‌సీఎల్) నిర్మాణ పనులను గురువారం కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి సదానందగౌడ పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణకే తలమానికం రామగుండం ఎరువుల కర్మాగారం' అని అన్నారు. మరో నాలుగు నెలల్లో ఎరువుల ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దక్షిణ భారత రైతులకు ఎరువుల కొరత లేకుండా కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా సదానందగౌడ చెప్పుకొచ్చారు. ఆర్ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగాల కల్పనకు డిసెంబర్ 13న అధికారికంగా నోటిఫికేషన్ వెలువడనుందనీ ఆయన ప్రకటించారు. స్థానికులకు ఉద్యోగాల విషయమై కేంద్రంతో చర్చించి న్యాయం చేస్తామని ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు