అంగన్ వాడి వర్కర్‌పై అత్యాచారయత్నం | Sakshi
Sakshi News home page

అంగన్ వాడి వర్కర్‌పై అత్యాచారయత్నం

Published Sun, Aug 23 2015 2:11 PM

raped by the anganwadi worker

ఇబ్రహీంపట్నం: ఇంట్లో ఒంటరిగా ఉన్న అంగన్‌వాడి వర్కర్ (42) పై ఓ వ్యక్తి అత్యాచారాయత్నం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కగూడలో ఆదివారం వెలగులోకి వచ్చింది.


వివరాలు..  గ్రామానికి చెందిన అంగన్‌వాడి కార్యకర్తగా పనిచేస్తున్న మహిళ శనివారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గ్రామానికి చెందిన జడల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో.. అక్కడినుంచి పరారయ్యాడు. ఈ మేరకు ఆదివారం ఆమె ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement