పోలీసుల అదుపులో టీచకుడు? | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో టీచకుడు?

Published Sat, Sep 5 2015 2:19 AM

rapist control of the police?

నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లాకేంద్రంలో ఇంటర్ విద్యార్థి భవాని మృతికి కారణమైన ఫిజిక్స్ అధ్యాపకుడు శ్రీనివాస్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అతని నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే నిందితుడు తనకేమి తెలియదని చెబుతున్నట్లు సమాచారం. తనెప్పుడూ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించలేదని పేర్కొనట్లు తెలిసింది. ఇప్పటికే పోలీసులు మరికొందరు విద్యార్థుల నుంచి అధ్యాపకుల ప్రవర్తనపైనా సమాచారాన్ని సేకరిస్తున్నారు.  
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement