రబీకి రెడీ | Sakshi
Sakshi News home page

రబీకి రెడీ

Published Tue, Dec 30 2014 8:37 AM

Ready rabiki

  • జూరాల ఆయకట్టులో సాగుకు సిద్ధమవుతున్న రైతులు
  • 12 రోజులకు ఒకమారు ఆన్‌ఆఫ్ పద్ధతిలో నీటివిడుదల
  • 42వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకే నీళ్లు !
  • రైతులు చర్యలు నష్టపోకుండా చర్యలు: జూరాల ఎస్‌ఈ
  • గద్వాల: జూరాల ఆయకట్టులో రైతులు రబీసాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో 12 రోజులకు ఒకమారు ఆన్‌ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏటా పంట చివరిదశలో నీళ్లందక నష్టపోతున్న రైతులు ఈ సారి ఆరుతడి పంటలే వేయాలని సూచిస్తున్నారు. రెండేళ్లుగా ఆరుతడి పంటలకే నీళ్లిస్తామని సాగునీటి సలహామండలి సమావేశంలో తీర్మానించడం, రైతులను జాగృతి చేయకపోవడంతో వరి సాగుచేసి నష్టపోతున్నారు. ఇక ఈ పరిస్థితి రాకూడదని.. ముందుగానే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

    ఈ రబీలోనూ ఆరుతడి పంటలకే నీళ్లిస్తామని ఈ నెల 10న కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అధ్యక్షతన జరిగిన ఐడీబీ సమావేశంలో తీర్మానించారు. ప్రియదర్శిని జూరాల ఇద్దరు కేబినెట్ మంత్రులు. మరో ముగ్గురు కేబినెట్ ర్యాంకు పదవులున్న నేతలు. రాష్ట్రంలో విస్తీర్ణంలోనే అతి పెద్ద జిల్లా. వెనుకబడిన జిల్లాగా పేరొందిన చోట సమస్యలు కూడా సవాలక్ష. నేతలు, అధికారులకు, కలెక్టర్‌కు ఇతర విభాగాలకు నడుమ సమన్వయ లోపం. తక్షణ సమస్యలపైనే దృష్టి పెడుతూ ఉరుకులు పరుగులు. జిల్లా సమగ్రాభివృద్ధిపై కానరాని సమీక్షలు. మొత్తంగా జిల్లా పాలన యంత్రాంగం పనితీరు ఎవరికి వారే... యమునాతీరే అన్న చందంగా మారింది.
     
    సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :పాలన యంత్రాంగం పనితీరు దిశా నిర్దేశం లేకుండా సాగుతుండడంతో జిల్లాలో నెలకొన్న చిన్నా చితక సమస్యలకు కూడా పరిష్కారం దొరికే పరిస్థితి కనిపించడం లేదు. సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఇతర సమస్యలపై దృష్టి సారించక పోవడంతో సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ శాఖల వారీగా సమీక్షలు కొరవడంతో కొన్ని ప్రభుత్వ విభాగాల ఉనికి నామమాత్రంగా తయారైంది.

    కొన్ని విభాగాల సమీక్షలు అధికారులు సమర్పించే మొక్కుబడి నివేదికలతో ముగుస్తున్నాయి. పాలన యంత్రాంగానికి సారథ్యం వహించే కలెక్టర్‌కు, ఇతర అధికారులు, సిబ్బందికి నడుమ సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నడుమ పొంతన కుదరక పాలనపై ప్రభావం చూపుతోంది. జిల్లాలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న జాయింట్ కలెక్టర్‌ను కలెక్టర్ విశ్వాసంలోకి తీసుకోవడం లేదని కలెక్టరేట్ సిబ్బంది బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.

    జాయింట్ కలెక్టర్ పరిధిలోని ఇసుక అనుమతులు అంశాన్ని తప్పించి డీఆర్వో నేతృత్వంలోని ‘సాండ్ సెల్’కు అప్పగించడం ఇద్దరి మధ్య నెలకొన్న అగాథాన్ని సూచిస్తోంది. రుణమాఫీ లబ్ధిదారుల జాబితా, సామాజిక పింఛన్లు, ఆహారభద్రత కార్డుల లబ్ధిదారుల గుర్తింపు వంటి విషయాల్లో రెవెన్యూ యంత్రాంగం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.
     
    ఆగిన ఫీల్డ్ విజిట్స్

    బాధ్యతలు స్వీకరించిన కొత్తలో క్షేత్రస్థాయి పర్యటనలతో తీరికలేకుండా గడిపిన కలె క్టర్ ప్రస్తుతం కార్యాలయానికి ఎక్కువగా పరిమితమవుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే, రుణమాఫీ, సామాజిక పింఛన్ల లబ్ధిదారుల గుర్తింపు వంటి పనుల్లో కలెక్టర్ ఒత్తిడి చేయడంపై ఓ దశలో ఉద్యోగులు ‘వర్క్ టు రూల్’ పేరిట నిరసనకు దిగారు. జాబితాల పరిశీలన, కంప్యూటరీకరణ, వీడియో కాన్ఫరెన్స్‌లతో కుటుంబంతో గడిపే పరిస్థితి లేకుండా పోయిందని ఉద్యోగులు ఆరోపించారు. నవంబర్ 8న సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఉద్యోగులతో కలెక్టర్ రాజీ కుదుర్చుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ‘తమకూ యూనియన్లు ఉన్నాయని’ ఆవేదన వ్యక్తం చేసిన కలెక్టర్ ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలను పూర్తిగా తగ్గించారు.

     ‘అనేక అంశాలపై దిశా నిర్దేశం కోరేందుకు కలెక్టర్ వద్దకు వెళ్తున్నాం. కానీ పూర్తిస్థాయిలో చర్చించే పరిస్థితి లేక వెనుదిరగాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి అందే తక్షణ ఆదేశాలపైనే అధికార యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ఇతరశాఖల అంశాలపై పూర్తిస్థాయి సమీక్ష జరగడం లేదు’ అంటూ కొందరు అధికారులు లోలోన వ్యాఖ్యలు చేస్తున్నారు. జిల్లా పరిషత్ సమావేశాలు కేవలం రాజకీయాలకే పరిమితం అవుతున్నాయి. జిల్లాకు నూతనంగా సీఎం కేసీఆర్ పదవుల పందేరం చేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులు శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తే తప్ప జిల్లాలో పాలన పట్టాలెక్కేలా లేదు.
     

Advertisement
Advertisement