ఎండల ధాటికి.. అంగన్‌వాఢీలా.. | Sakshi
Sakshi News home page

ఎండల ధాటికి.. అంగన్‌వాఢీలా..

Published Fri, Apr 15 2016 12:57 AM

ఎండల ధాటికి.. అంగన్‌వాఢీలా.. - Sakshi

కేంద్రాల్లో తగ్గిన చిన్నారుల హాజరు
పనివేళలు కుదించాలని నిర్వాహకుల వినతి

 

కాజీపేట : సూర్యుడు నిప్పులు కక్కుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. ఇక చిన్నారులు, వృద్ధులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఎండల ధాటికి నగరంలోని చాలా పాఠశాలలను 11.30 గంటల వరకే మూసేసి, పిల్లల్ని ఇళ్లకు పంపించేస్తున్నారు. ఇక అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నారుల హాజరు శాతం సగానికి సగం పడిపోరుుంది. ఉదయం 11 గంటలు దాటితే ఆయూ కేంద్రాల్లో పిల్లల జాడ కనిపించడం లేదు. మండుటెండల్లో తమ పిల్లల్ని ఇంటి బయటికి పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ఎండలు తగ్గేవరకు అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు పనిచేసేలా చూడాలని నిర్వాహకులు కోరుతున్నారు. తద్వారా చిన్నారుల హాజరు శాతం కొంతమేర పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.


చాలా కేంద్రాల్లో వసతుల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫలితంగా అంగన్‌వాడీలకు వెళ్లే చిన్నారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఏప్రిల్‌లోనే ఇంత భారీ స్థారుులో ఉష్ణోగ్రతలుంటే.. ఇక మే, జూన్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన జనంలో వ్యక్తమవుతోంది. దీనిపై ఐసీడీఎస్ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా ‘ఎండ తీవ్రతకు భయపడి పిల్లలు సక్రమంగా కేంద్రాలకు రావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రాల పనివేళలను తగ్గించే అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు’ అని వివరించారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement