సమ్మెబాటలో సీఆర్టీలు | Sakshi
Sakshi News home page

సమ్మెబాటలో సీఆర్టీలు

Published Wed, Nov 26 2014 3:06 AM

Residential teacher contract in strike

ఆదిలాబాద్ రూరల్ : తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీలు (కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్) ఆందోళనబాట పట్టారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గతంలో ఇచ్చిన హామీలు తీర్చడంలేదని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లాలోని అన్ని డివిజన్ కేంద్రాల పరిధిలోని ఏటీడబ్ల్యూవో కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు.

బుధవారం ఉట్నూర్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా, గురువారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నారు. అప్పటికీ ప్రభుత్వం, అధికారులు స్పందించకపోతే చలో హైదరాబాద్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. కాగా ఏటా సీఆర్టీలను జూన్‌లో నియమిస్తారు. ఈ ఏడాది అధికారులు నిర్లక్ష్యం చేసి జూలై 9న నియమించారు. దీంతో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు పాఠాలు కాక నష్టపోయారు. ప్రస్తుతం వారు సమ్మెకు దిగడంతో మరోసారి నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ఇవీ డిమాండ్లు..
     పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల వేతనాలు చెల్లించాలి
     సీఆర్టీలకు రావాల్సిన ఇంక్రిమెంట్‌లను వెంటనే అందజేయాలి
     {పతి నెల ఒకటవ తేదీన వేతనాలు ఇవ్వాలి
     మహిళ సీఆర్టీలకు మెటర్నటీ సెలవులు మంజూరు చేయాలి
     కేజీబీవీ సీఆర్టీల మాదిరిగానే తమకు వేతనాలు చెల్లించాలి
     సర్వీసుతో సంబంధం లేకుండా అందరినీ క్రమబద్ధీకరించాలి
     సీఆర్టీలందరికీ సంవత్సరానికి 22 సీఎల్‌లు మంజూరు చేయాలి.

Advertisement
Advertisement