ఈత సరదా ప్రాణం తీసింది | Sakshi
Sakshi News home page

ఈత సరదా ప్రాణం తీసింది

Published Sun, May 25 2014 3:14 AM

Resulted in the swimming fun

 కోల్‌సిటీ, న్యూస్‌లైన్: ఈత కొట్టాలనే సరదా ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. మహారాష్ట్రకు చెందిన మున్నాపటేల్(23) గోదావరినదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. బాధితులు, టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలం ఇందారంలోని భారత్ జిన్నింగ్ మిల్లులో గోదావరిఖనికి చెందిన శ్యాంతోపాటు మహారాష్ట్రకు చెందిన బబ్బూల్‌పటేల్, సల్మాన్‌పటేల్, మున్నాపటేల్, విశాల్ ఖౌడే, ఆదిలాబాద్‌కు చెందిన సయ్యద్ ఆశ్రఫ్, సయ్యద్ అర్షద్, సయ్యద్ ఖలీం, కర్ణాటకకు చెందిన నాగరాజు పని చేస్తున్నారు. తోటి కార్మికుడు శ్యాం వివాహానికి హాజరయ్యేందుకు శనివారం హనుమాన్‌నగర్‌కు బైక్‌లపై బయలుదేరారు. వంతెన వద్ద గోదావరినదిలో స్నానం చేసేందుకు దిగారు. సయ్యద్ ఖలీం, సల్మాన్‌పటేల్, నాగరాజు మాత్రం తక్కువ లోతు ఉన్న  ప్రాంతంలోనే ఉండిపోగా, సయ్యద్ అర్షద్, వి శాల్ ఖౌడే, బబ్బూల్‌పటేల్, సయ్యద్ ఆశ్రఫ్, మున్నాపటేల్ ఈత కొడుతూ మధ్యలోకి వెళ్లా రు. నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మున్నా గల్లంతయ్యాడు. మిగతా వారు నీటిలో మునిగిపోతుండడంతో భయంతో రక్షించాలం టూ కేకలు వేయగా సమీపంలో చేపలు పడుతు న్న మత్స్యకారులు వచ్చి వారిని ఒడ్డుకు చేర్చా రు.  మున్నా మృతదేహం కోసం టూటౌన్ పో లీసులు, గజ ఈతగాళ్లు, సింగరేణి రెస్క్యూ టీం, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు ఆచూకీ లభించలేదు.  
 
 వలస వచ్చిన సోదరులు..
 మహారాష్ట్ర మోత్‌మావ్ జిల్లాలోని బిట్టర్‌గావ్‌కు చెందిన సోదరులు బబ్బూల్‌పటేల్, మున్నాపటేల్, సల్మాన్‌పటేల్ ఉపాధి కోసం  ఆదిలాబాద్ జిల్లా ఇందారంలోని జిన్నింగ్ మిల్లులో ఏడాదిగా పనిచేస్తున్నారు. వీరి తల్లి ఏడాది క్రితం మరణించింది. మున్నాపటేల్ చనిపోయిన విషయాన్ని మహారాష్ట్రలోని వీరి పెద్దన్న అక్తరుల్లాపటేల్‌కు సమాచారమిచ్చారు.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement