కోరుట్ల: ఇందిరమ్మ కాలనీల్లో జరిగిన అక్రమాలు రెవెన్యూ అధికారుల విచారణతో వెలుగులోకి వస్తున్నాయి. కుప్పలు తెప్పలుగా బినామీలు..అనర్హులు కాలనీల్లో అడ్డాలు వేసిన వైనం అధికార యంత్రాంగాన్ని నివ్వెరపరుస్తోంది. కాలనీల్లో నిజమైన లబ్దిదారులు పదిశాతం కనిపించకపోవడంతో జోరుగా అక్రమాలు సాగినట్లు స్పష్టమవుతోంది. కోరుట్ల పట్టణంలో ఏడు సంవత్సరాల క్రితం పేదలకు కెటాయించిన ఇందిరమ్మ కాలనీల్లో రెండు రోజులుగా రెవెన్యూ సిబ్బంది విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో ఎక్కడిక్కడే బినామీలు ఉండటం గమనార్హం.
నేతలే సూత్రధారులు..
కోరుట్ల పట్టణంలోని అర్బన్‌కాలనీ, ఏసుకోనిగుట్ట కాలనీ, నక్కలగుట్ట కాలనీ, అల్లమయ్యగుట్ట కాలనీ, మాదాపూర్ కాలనీల్లో ఏడు సంవత్సరాల క్రితం సుమారు 3వేల మందికి ఇందిరమ్మ ఇళ్ల కింద ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసి హౌసింగ్ రుణాలు ఇచ్చి ఇండ్లు కట్టించింది. ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పంపిణీ సమయంలో అప్పటి అధికార పార్టీ నేతలు..ప్రజాప్రతినిధులు జోరుగా అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. కొంత మంది నేతలు బినామీల పేరిట ఐదు నుంచి పది పట్టాలు పొంది తప్పుడు దృవీకరణ పత్రాలు సృష్టించి హౌసింగ్ లోన్లు పొందారు. ఇండ్లు కట్టిన అనంతరం వాటిని రూ.5 నుంచి 15లక్షలకు ఇతరులకు అమ్ముకున్నారు. వందలాది ఇళ్లు కోరుట్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటైన కాలనీల్లో బినామీలు లబ్దిపొందారు. కొంత మంది అనర్హులకు పట్టాలు అందడంతో వారు ఇండ్లు కట్టి ఇతరులకు అద్దెకు ఇచ్చిన వైనం విచారణలో వెలుగుచూస్తోంది.
జాడలేని లబ్ధిదారులు..
ఇందిరమ్మ కాలనీల ఏర్పాటు సమయంలో లబ్ధిపొందిన వారిలో చాలా మంది ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. రెవెన్యూ అధికారులు సాగిస్తున్న విచారణలో అర్బన్ కాలనీలో 90 ఇళ్లలో సర్వే చేయగా కేవలం 22 మంది మాత్రమే నిజమైన పట్టాదారులు ఉన్నారు. మాదాపూర్ కాలనీలో 94 ఇళ్ల సర్వే జరగగా..16 మంది మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు. ఏసుకోని గుట్ట కాలనీలో 50 ఇళ్ల సర్వే ముగియగా కేవలం 14 మంది మాత్రమే లబ్దిదారులు ఉన్నారు. ఈ మూడు కాలనీల్లో ఇప్పటి వరకు 234 ఇండ్ల సర్వే పూర్తి కాగా కేవలం 52 మంది మాత్రమే నిజమైన లబ్ధిదారులుగా తేలారు. మిగిలిన ఇళ్లలో అద్దెకు ఉన్నవారు..ఇళ్లు కొనుగోలు చేసిన వారు ఉన్నట్లుగా విచారణలో తేలింది. ఇంకా పట్టణంలోని వివిధ కాలనీల్లో సుమారు 2500 ఇళ్ల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చెందిన విచారణ సాగాల్సి ఉంది.
బినామీల అడ్డాలు!
Published Fri, Jun 2 2017 1:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement