గొర్రెల పంపిణీకి రూ.1,400 కోట్లు | Sakshi
Sakshi News home page

గొర్రెల పంపిణీకి రూ.1,400 కోట్లు

Published Thu, Jan 12 2017 3:11 AM

గొర్రెల పంపిణీకి రూ.1,400 కోట్లు - Sakshi

► 21లక్షల గొర్రెల పంపిణీకి ఎన్‌సీడీసీ నుంచి రుణం
► ప్రభుత్వానికి పశు సంవర్ధక శాఖ ప్రతిపాదన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీకి పశు సంవర్ధకశాఖ సన్నాహాలు చేస్తోంది. రూ. 1,400 కోట్లతో 21 లక్షల గొర్రెలను గొర్రెల పెంపకందారులకు సరఫరా చేయాలని నిర్ణ యించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపా దనలు పంపింది. ఇందులో రూ.280 కోట్లు లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాలి. మిగిలిన సొమ్మును జాతీయ సహకార అభి వృద్ధి సంస్థ (ఎన్ సీడీసీ) నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది. అందుకోసం ప్రభుత్వ గ్యారంటీ కోరాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా భావిస్తున్నారు. మొత్తం లక్ష యూనిట్లు లక్ష మందికి అందజేస్తారు.

ఒక్కో యూనిట్‌లో 21 గొర్రెలుంటాయి. పావులా వడ్డీ కింద ఈ గొర్రెలను సరఫరా చేస్తారు. సామాజిక వర్గంతో సంబంధం లేకుండా సొసైటీల్లో సభ్యత్వం ఉంటేనే వారికి గొర్రెలు పంపిణీ చేస్తారు. ఇప్పటికే వారు 5 గొర్రెలను కలిగి ఉండటం ప్రధాన అర్హత. ఆ తర్వాత సొసైటీలో సభ్యత్వం కలిగి ఉండాలి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 150 రిటైల్‌ చేపల మార్కెట్లను ఏర్పాటు చేయాలని పశు సంవర్ధక శాఖ నిర్ణయించింది. వాటిని చేపల సొసైటీలకు అప్పగిస్తారు. ఒక్కో చేపల మార్కెట్‌కు రూ.7.5 లక్షలు ప్రభుత్వం కేటాయించింది.

Advertisement
Advertisement