రూ.96 కోట్ల ‘ఎమ్మార్’ ఆస్తుల అటాచ్‌మెంట్ | Sakshi
Sakshi News home page

రూ.96 కోట్ల ‘ఎమ్మార్’ ఆస్తుల అటాచ్‌మెంట్

Published Tue, Nov 25 2014 1:28 AM

Rs .96 crore, 'Emaar' attachment of assets

సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) రూ.96 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఇందులో సౌత్‌ఎండ్ ప్రాజెక్టుకు చెందిన రూ.20 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇందూ ప్రాజెక్ట్స్ శ్యాంప్రసాద్‌రెడ్డికి చెందిన రూ.10 ముఖవిలువ కలిగిన 2.52 కోట్ల షేర్లు, రంగారెడ్డి జిల్లా మర్‌పల్లె మండలంలో ఉన్న కోనేరు ప్రదీప్‌కు చెందిన 36.14 ఎకరాల భూమి, ఈహెచ్‌టీపీఎల్‌కు చెందిన విక్రయించని 14 ప్లాట్లు, స్టైలిష్‌హోం పేరుతో గచ్చిబౌలిలో ఉన్న 2,057 గజాల భూమి, ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ పేరుతో నానక్‌రామ్‌గూడలో ఉన్న 4.80 ఎకరాల భూమి ఉన్నాయి.

Advertisement
 
Advertisement