ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు | Sakshi
Sakshi News home page

ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు

Published Tue, Mar 3 2015 2:53 AM

ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు - Sakshi

- ఆర్టీసీ హైదరాబాద్ ఈడీ జయరావు
- మహేశ్వరం డిపోలో కొత్త బస్సు సర్వీసులు ప్రారంభం

మహేశ్వరం: ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడమే ఆర్టీసీ లక్ష్యమని గ్రేటర్ హైదరాబాద్ జోనల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరాజ్ పేర్కొన్నారు. మహేశ్వరం ఆర్టీసీ డిపోలోని 9 కొత్త బస్సులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగాగా మాట్లాడుతూ... ప్రతి గ్రామం, గిరిజన తండాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అం దించేందుకు కృషి చేస్తామని అన్నారు.   

డిపో ప్రారంభించినప్పటి నుంచి పెట్రోల్ బంక్ లేక పోవడంతో బస్సులు నడపడానికి కొంత ఆలస్యం జరిగిందన్నారు. మొన్నటివరకు మిథాని డిపో నుంచి బస్సు సర్వీసులు నడిచేవని, ఇక నుంచి నేరుగా మహేశ్వరం డిపో నుంచే నడుస్తాయన్నారు. కల్వకోల్, సిద్దాపూర్, బాచుపల్లి, కొత్తపేట్, పెద్దమ్మతండా, తిమ్మాపూర్, మురళీనగర్, అన్నోజి గూడ, అమీర్‌పేట్ గ్రామాలకు కొత్త సర్వీసులను ప్రారంభించారు. త్వరలో మరిన్ని సర్వీసులను పెంచుతామని చెప్పారు.

కార్యక్రమంలో హైదరాబాద్ రీజినల్ మేనేజర్ జయరావు, డీవీఎం సూర్యకిరణ్, ఎంపీపీ పెంటమల్ల స్నేహ, జేడ్పీటీసీ సభ్యుడు నేనావత్ ఈశ్వర్ నాయక్, వైస్ ఎంపీపీ మునగపాటి నవీన్, సర్పంచ్ ఆనందం, ఉప సర్పంచ్ రాములు, ఎంపీటీసీ సభ్యులు బంగరిగళ్ల ప్రేమలత, బుజ్జి భద్రునాయక్, డిపో మేనేజర్  పవిత్ర, ట్రాఫిక్ ఇన్‌చార్జిలు బి.ప్రభాకర్, శివరంజన్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement