సాక్షర భారత్‌ కోఆర్డినేటర్ల నిరసన | Sakshi
Sakshi News home page

సాక్షర భారత్‌ కోఆర్డినేటర్ల నిరసన

Published Wed, Jun 6 2018 12:49 PM

Saakshar Bharat Coordinators protest - Sakshi

కామారెడ్డి రూరల్‌: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సాక్షరభారత్‌ గ్రామ, మండల కోఆర్డినేటర్ల ధీర్ఘకాల కామారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట ధర్నాచౌక్‌ వద్ద చేపట్టిన రిలే నిరహార దీక్షలు మంగళవారం నాటికి రెండో రోజుకు చే రుకున్నాయి. కళ్లకు గంతలు కట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సాక్షరభారత్‌ కోఆర్డినేటర్ల జిల్లా అధ్యక్షుడు బత్తుల రవి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 8 సంవత్సరాల నుంచి చాలీచాలనీ వేతనాలు అందిస్తూ అవికూడా సంవత్సరాల కాలం పాటు చెల్లంచకుండా కోఆర్డినేటర్ల జీవితాలతో ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్షరాస్యత అభివృద్ధి చెందకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు అందించాలని దానిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. ప్రభుత్వాలు తమకు న్యాయం చేసేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. ప్రతిరోజు, రెండు మండలాల చొప్పున గ్రామ, మండల కోఆర్డినేటర్లు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.

తమ న్యాయమైన డిమాండ్‌లైన సాక్షరభారత్‌ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనసాగిస్తు కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగభద్రత కల్పించాలని, çసమానవేతనం అందించాలని, వయోజనవిద్య, సాక్షరభారత్‌ కార్యక్రమాన్ని పంచాయితీరాజ్‌శాఖలో విలీనం చేయాలని వయోజన విద్యా కేంద్రాలను గ్రంథాలయాలుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. మండల కోఆర్డినేటర్లు చంద్రశేఖర్, దత్తు, కామారెడ్డి, బిచ్కుంద మండలాలగ్రామకోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement