సాక్షి విలేకరి అక్రమ అరెస్టు | Sakshi
Sakshi News home page

సాక్షి విలేకరి అక్రమ అరెస్టు

Published Fri, Feb 26 2016 4:22 AM

సాక్షి విలేకరి  అక్రమ అరెస్టు - Sakshi

చేయని తప్పుకు శిక్షకులదూషణ కేసులో అరెస్టు చేసిన
గోదావరిఖని ఏఎస్పీఆ రోజు తాను లేనంటూ ఆ ధారాలు చూపినా  విచారణ పేరుతో పిలిచి అరెస్టు
అరెస్టును తీవ్రంగా ఖండించినటీయూడబ్ల్యూజే(హెచ్-143), టెమ్జు
పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదుఅక్రమ అరెస్టుకు నిరసనగా నేడు జిల్లావ్యాప్త ఆందోళనలకు పిలుపు

  
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :చేయని తప్పుకు సాక్షి విలేకరిపై అకారణంగా కేసు పెట్టారు. కులం పేరుతో దూషించారంటూ అరెస్టు చేశారు. ఆ రోజు తానెవరినీ కులం పేరుతో దూషించలేదు.. తాను సమ్మక్క జాతరకు వెళ్లానని ఆధారాలు చూపినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. విచారణ పేరుతో పిలిపించిన గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్ విలేకరిని ఆగమేఘాలపై అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. పోలీసుల తీరును తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(హెచ్-143), తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం(టెమ్జు) జిల్లా కమిటీలు తీవ్రంగా ఖండించాయి. నేడు జిల్లావ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి.

 అక్రమ కేసుకు ఆధారాలివిగో....
ముత్తారం మండల సాక్షి విలేకరి పొన్నం శ్రీనివాస్ గత నెల 30న తన ఉదయం 10.30 గంటలకు కుటుంబసభ్యులతో కలిసి మేడారం వెళ్లాడు. మధ్యాహ్నం 2గంటలకు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని, సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో లక్నవరం సందర్శించాడు. తిరుగు ప్రయాణంలో రాత్రి 8గంటల ప్రాంతంలో కాటారంలో మిత్రులతో మాట్లాడి అక్కడినుంచి బేగంపేట క్రాస్‌రోడ్డులోని ఇంటికి చేరుకున్నాడు. అయితే శ్రీనివాస్‌పై అదేరోజు కులంతో దూషించారంటూ మీనుగు రాములు అనే వ్యక్తి ముత్తారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్న సమయంలో ముత్తారంలోని మల్యాల రాజయ్యకు చెందిన దాబా హోటల్‌కు శ్రీనివాస్ వెళ్లి భోజనం పెట్టాలని అడిగారని, అందులో పనిచేస్తున్న మీనుగు రాములు అనే యువకుడు జోక్యం చేసుకుని... ‘ఇంతకుముందే మా సేట్‌కు రూ.4,500 నీవు ఇవ్వాలి. ఆ డబ్బులు ఇస్తేనే భోజనం పెట్టాలని మా సేట్ చె ప్పాడు.

అందువల్ల నేను భోజనం పెట్టను’ అని చెప్పగా... అతడిని శ్రీనివాస్ కులం పేరుతో దూషించారు’ అనేది ఆ ఫిర్యాదు సారాంశం. ముత్తారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న శ్రీనివాస్ ఈనెల 4న గోదావరిఖని ఏఎస్పీ కార్యాలయానికి వెళ్లి... ముత్తారం దాబాలో సంఘటన జరిగినట్టుగా చెబుతున్న రోజు తాను మేడారం వెళ్లానని ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్‌కు వివరించాడు. కులదూషణ కేసు కావడంతో ఏఎస్పీ విచారణ చేపట్టారు. ఈనెల 5న చేపట్టిన విచారణలో భాగంగా శ్రీనివాస్ తన సెల్‌ఫోన్ ద్వారా మేడారం జాతరలో తీసిన ఫొటోలను ఏఎస్పీకి చూపించాడు. ఏఎస్పీ మరో రెండు రోజుల తర్వాత కూడా మళ్లీ విచారణ జరిపారు. అయితే సెల్‌ఫోన్‌లో తీసిన ఫొటోలకు సమయం తప్పుగా నమోదైందని పేర్కొంటూ వాటిని ల్యాప్‌టాప్‌లో వేసి సరైన సమయాన్ని చూపించారు.

కానీ ల్యాప్‌ట్యాప్‌లో ఫొటోల సమయాన్ని మార్పు చేయవచ్చని ఏఎస్పీ పేర్కొనడంతో తనకు చెందిన, తన కుటుంబసభ్యులకు చెందిన సెల్‌ఫోన్ల నెంబర్ల కాల్‌టాడా కూడా సేకరించాలని, తాను మేడారం జాతరకు వెళ్లిన సమయంలో కాటారం, మహాముత్తారం తదితర ఏరియాలలో రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించాలని శ్రీనివాస్ ఏఎస్పీని కోరారు.

 విచారణ పేరుతో పిలిచి అరెస్ట్...
ఈ క్రమంలో సమ్మక్క జాతర రావడం, ఫిర్యాదుదారులు అందుబాటులో లేకపోవడంతో విచారణ ఆలస్యమైంది. తిరిగి గత మంగళవారం విచారణకు రావాలని ఏఎస్పీ కార్యాలయం నుంచి ఫోన్ రాగా... వెళ్లడానికి శ్రీనివాస్ సిద్ధమయ్యాడు. తాను వస్తున్నట్టు ఫోన్‌ద్వారా ఏఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇవ్వగా... సర్ అందుబాటులో లేరని, గురువారం రావాలని సమాధానమిచ్చారు. అయితే విచారణ కోసం పిలిపిస్తున్నారే తప్ప తనను ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ పరుస్తున్నట్లు ఏఎస్పీ ఏనాడూ తెలపలేదని శ్రీనివాస్ పేర్కొంటున్నాడు. తాను మేడారం జాతరకు వెళ్లినట్టు ఆధారాలు చూపించినా వాటిని నమ్మకుండా తనను నేరం చేసిన వాడిలాగా అనుమానించి అదుపులోకి తీసుకున్నారని ఆవేదన చెందాడు.
 
 కులదూషణ కేసులో కుట్ర దాగిందా?
ముత్తారం మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ మల్యాల రాజయ్య ముత్తారంలోని సర్వే నెంబర్65లో గల ప్రభుత్వ భూమిని తన కుటుంబసభ్యుల పేరుతో పట్టా చేయించుకుని ఇతరులకు విక్రయిం చాడు. 2013 ఈ విషయమై ‘కబ్జాకోరల్లో ప్రభుత్వ భూమి’ అని కథనం సాక్షిలో ప్రచురితమైంది. దీంతో ఆనాడు తహసీల్దార్ సాక్షి గా మల్యాల రాజయ్య విలేకరి శ్రీనివాస్‌ను తిట్టగా... పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తర్వాత విలేకరి జోలికి వెళ్లనని రాజయ్య లేఖ రాసిచ్చాడు. అలాగే రాజయ్య గ తేడాది పారెపెల్లి శివారులోని ప్రభుత్వ భూమిపై కన్నేసి దళితులకు ఉచితంగా పట్టాలు చేయించి ఇస్తానని నమ్మబలికాడు.

ఇక్కడ దళితుల పట్టాలను ఆధారంగా చేసుకుని బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. కానీ ఆ రుణం మాఫీ కాకపోవడంతో బ్యాంకు వారు దళితులకు నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై 2014 డిసెంబర్ 18న కూడా సాక్షిలో కథనం వచ్చింది. దీనిపై రాజయ్య విలేకరికి లీగల్ నోటీస్ పంపించాడు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఇప్పటికి మూడు పేషీలు పూర్తయ్యాయి. తాజాగా ప్రభుత్వ భూమిని ఆన్‌లైన్‌లో బినామీల పేరుతో రాజయ్య రిజిస్ట్రేషన్ చేసుకున్న వైనంపై ఈ ఏడాది జనవరి 19న కథనం వచ్చింది. ఈ నేపథ్యంలోనే రాజయ్య కుట్రపూరితంగా దళిత యువకుడు మీనుగు రాములు ద్వారా తనపై తప్పుడు కేసు నమోదు చేయించి కుట్రపూరితంగా అరెస్టు చేరుుంచారని విలేకరి పొన్నం శ్రీనివాస్ వాపోయారు.
  
 కేసు ఎత్తివేయండి
పొన్నం శ్రీనివాస్ అక్రమ అరెస్టును ఆపాల ని కోరుతూ టీయూడబ్ల్యూ (హెచ్-143), టెమ్జు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పసునూరు మధు, పూదరి వెంకటేశ్, వేణుగోపాల్‌రావు, రఘుతో పాటు యూని యన్ నాయకులు బోనాల తిరుమల్, జేరి పోతుల సంపత్, మొగరం రమేశ్, చిప్పరి వెంకట్రాజు, గుంటపల్లి స్వామి, యాద గిరి, నవీన్ తదితరులు  ఇన్‌చార్జి ఎస్పీ, ఓఎస్డీ ఎల్.సుబ్బారాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. సమగ్ర విచా రణ జరపడంతోపాటు ఆధారాలు చూపినా పట్టించుకోకుండా అరెస్టు చేసిన పోలీసుల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ అనురాగ్‌శర్మ, ఐజీ నవీన్‌చంద్, డీఐజీ మల్లారెడ్డి దృష్టికి తీసు కెళ్లనున్నట్లు తెలి పారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేది లేదని, ప్రెస్ అకాడమీ, ప్రెస్ కౌన్సిల్ దృష్టికి కూడా తీసుకెళతామని స్పష్టం చేశా రు. పోలీసుల తీరుకు నిరసనగా శుక్రవా రం జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమా లు చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లాకేం ద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉదయం 11 గంటలకు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement