ఇసుక దొంగల అరెస్టు | Sakshi
Sakshi News home page

ఇసుక దొంగల అరెస్టు

Published Sat, Mar 14 2015 3:07 AM

Sand thieves arrested

 జమ్మికుంట రూరల్ : మండలంలోని విలాసాగర్ గ్రామంలో అనుమతి లేకుండా నిల్వ చేసిన ఇసుక డంప్‌లను అధికారులు సీజ్ చేయగా, ఆ ఇసుక చోరీకి గురైంది. ఇసుక దొంగలించిన 17మందిని అరెస్టు చేసి 17ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు పట్టణ సీఐ శ్రీనివాస్‌జీ తెలిపారు. శుక్రవారం టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మండలంలోని విలాసాగర్ గ్రామంలో జనవరి 9న స్థానిక పోలీసులు అనుమతిలేకుండా నిల్వ చేసిన ఇసుక డంప్‌లను గుర్తించి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఫిబ్రవరి 6న స్థానిక తహశీల్దార్ పోలీసులు సీజ్ చేసిన ఇసుకను వేలం వేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో 145 ట్రిప్పుల ఇసుక చోరీకి గురైంది. దీంతో ఫిబ్రవరి 21న తహశీల్దార్ రజని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
 కేసు నమోదు చేసిన పోలీసులు ఇసుక దొంగలను గుర్తించి అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో విలాసాగర్ గ్రామానికి చెందిన సిరిసేటి శ్రీనివాస్, సిరిసేటి అశోక్, గరిగంటి రవి, గరిగంటి శ్రీనివాస్, రాచపల్లి రమేష్, రాచపల్లి తిరుపతి, గరిగంటి శ్రీధర్, ఆరెల్లి భాస్కర్, చిలుక అశోక్, సిరిసేటి శ్రీనివాస్, గరిగంటి లింగమూర్తి, గరిగంటి అశోక్, కుక్కల రాజ్‌కుమార్, మండల అనిల్, ఐలవేని ప్రశాంత్, రాచపల్లి వంశీకుమార్, బండారి రాజయ్య ఉన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ మారముల్ల సంజయ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement