భయం వలదు | Sakshi
Sakshi News home page

భయం వలదు

Published Fri, Aug 15 2014 3:22 AM

'sarvey' janah sukhina bhavantu

ప్రగతినగర్ : ‘‘ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తయారు చేయడం, అమలు చేయాలన్నా, ఆ రాష్ట్ర కుటుంబాల, ప్రజల సమగ్ర సమాచారం అవసరం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బేస్‌లైన్ సమాచారం సేకరించడానికి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాలని నిర్ణయించింది. సమగ్ర కు టుంబ సర్వేలో అన్ని కుటుంబాలకు సంబంధించి పూర్తి సమాచారం ఆగస్టు 19న సేకరించనున్నారు.

ఆ రోజున ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చి వివరాలు నమోదు చేసుకోనున్నారు. పది విభాగాలలో 80కిపైగా అంశాలలో వివరాలు సేకరించనున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజల ఆశలు నెరవేరాలంటే పక్కా లెక్కలు ఉండాలి. అర్హులు, లక్ష్యి త వర్గాలకు పథకాలు అందాల్సిన అవసరం ఉంది’’ అని కలెక్టర్ రొనాల్డ్ రాస్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా కుటుంబ సమాచారం సేకరించనున్నట్లు చెప్పారు.

అప్పుడు ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి సరైన రీతిలో అందడానికి ఆస్కారం ఉంటుందన్నారు. సర్వే రోజున ప్రజలు ఎలాంటి పనులు, ప్రయాణాలు పెట్టుకోవద్ధన్నారు. ఇంటి వద్దనే ఉండి ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్‌కు సహకరించాలన్నారు. అడిగిన సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎన్యూమరేటర్ వచ్చిన సమయంలో ఈ దిగువన ఉన్న ప్రతులు,సమాచారం అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
 
సర్వేపై భయాందోళన వద్దు
 సర్వేపై ఎవ రూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు. ఎక్కడి వారు అక్కడ ఉన్నచోట సరైన పత్రాలు చూపి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ఈ సర్వే కాదు, కుటుంబ గణాంకాల నమోదు కోసమే సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 19న ఎవరైతే ఇంటివద్ద ఉంటారో వారిపేర్లు నమోదు చేసుకుంటాం, గల్ఫ్, ఇతర దేశాలకు బతుకు దెరువు కోసం వెళ్లి వారి వివరాలను తర్వాత నమోదు చేస్తామన్నారు.

 పక్క జిల్లాలలో, రాష్ట్రాలలో చదువుతున్న విద్యార్థులు సొంత ఇళ్లకు రావాల్సిన అవసరం లేదన్నారు. వారు చదువుతున్న ధ్రువీకరణపత్రాలు కుటుంబీ కులు చూపెడితే సరిపోతుందన్నారు. జిల్లా వ్యా ప్తంగా 31 వేల సిబ్బంది ఉన్నారని, సర్వే కోసం 27,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. 2,300 మంది ప్రైవేట్ టీచర్లు సర్వేలో పాల్గొంటున్నట్లు తెలిపారు. అనాథలు, సంచార జీవుల కోసం ప్రభుత్వం ఒక ఫార్మాట్‌ను తయారు చేసిందన్నారు. అత్యవసరంగా ఆస్పత్రులలో చికిత్స పొందితే, దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం అందిస్తే సరిపోతుందన్నారు.

Advertisement
Advertisement