ఏప్రిల్ 9న సత్యం కేసు తుది తీర్పు | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 9న సత్యం కేసు తుది తీర్పు

Published Mon, Mar 9 2015 10:40 AM

ఏప్రిల్ 9న సత్యం కేసు తుది తీర్పు

హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు మరోసారి వాయిదా పడింది. తుది తీర్పును సోమవారం న్యాయస్థానం ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. దాదాపు ఆరేళ్ల పాటు కొనసాగిన విచారణ కొద్ది నెలల క్రితమే పూర్తయినప్పటికీ తీర్పు మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ప్రత్యేక న్యాయస్థానం గతేడాది డిసెంబర్ 23 నాటికే తుది తీర్పు వెలువరించాల్సి ఉన్నా.. కేసును క్షుణ్ణంగా పరిశీలించి తీర్పును వెలువరించాల్సి ఉందంటూ ప్రత్యేక జడ్జి తీర్పును మార్చి 9కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఈ కేసు తొలుత అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విచారించినప్పటికీ అనంతరం 2010లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఆరేళ్ల పాటు సాగిన  కేసులో ఆరేళ్లు విచారణ చేపట్టిన సీబీఐ సుమారు 3,187 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. దాదాపు 226 మంది సాక్షులను విచారించింది.

 

Advertisement
Advertisement