నిఘా ‘జీరో’ | Sakshi
Sakshi News home page

నిఘా ‘జీరో’

Published Thu, Aug 13 2015 4:05 AM

నిఘా ‘జీరో’

సాక్షిప్రతినిధి, ఖమ్మం : పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం, ఎరువులు, సంక్షేమ పథకాలు వీటన్నిటిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిఘా పెడుతోందని ప్రకటిస్తున్నా..దొడ్డిదారి చర్యలకు తలుపులు ఎప్పుడూ బార్లా తెరిచే ఉంటున్నారుు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లాలో భారీస్థాయిలో అవినీతి జరిగింది. ఇల్లు కట్టకుండానే రూ.కోట్లలో బిల్లులు ఎత్తిన సంఘటనలు కోకొల్లలు. విజిలెన్స్ విచారణలో అవకతవకలు బయటపడ్డారుు. నిరుపేదల కడుపు నింపే రేషన్ బియ్యం వేల క్వింటాళ్లు ప్రతి నెలా అక్రమమార్గం పడుతూనే ఉంది. లెవీకి పెట్ట డం, పాలిష్ చేసి సన్నబియ్యం కింద అమ్మ డం షరామామూలే అరుుంది. రేషన్ డీలర్లే ఈ తంతుకు ఊతం ఇస్తున్నట్లు తెలుస్తోంది.    ఈ నల్లడీలర్లంతా ము ఠాగా ఏర్పడి.. ములకలపల్లి, సత్తుప ల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం ప్రాం తాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ పసిగట్టింది.

 క్వింటాళ్లు క్వింటాళ్ల  బియ్యం అక్రమార్గం..
 రేషన్ బియ్యం క్వింటాళ్లకు క్వింటాలే అక్రమ మార్గం పడుతున్నా సంబంధి త అధికారులు మాత్రం నిఘా వ్యవస్థ ను పటిష్టం చేయడం లేదు. ఈనెల 10 న పాల్వంచలో 200 క్వింటాళ్ల బియ్యా న్ని సంబంధిత అధికారులు పట్టుకున్నారు. మండలంలోనే వీటిని కొనుగో లు చేసినట్లు అధికారులు గుర్తించారు. వీటిని రీసైక్లింగ్ చేసి ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెంకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఏన్కూరు మండలం గార్లొడ్డులో అక్రమంగా తరలిస్తున్న 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సఫ్లరుు అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

బియ్యంతో పాటు లారీని సీజ్ చేసి నలుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసారు. ఇక్కడ కూడా రమేష్ అనే దళారీ, డీలర్లు, వినియోగదారుల నుంచి రేషన్ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లా సరిహద్దులు దాటించి రీసైక్లింగ్ చేసే ప్రయత్నంలో అధికారులకు పట్టుబడ్డాడు. ఎన్ని చెక్‌పోస్టులు పెట్టినా అధికారుల కళ్లు కప్పి రేషన్ బియ్యం పక్కదారి పడుతూనే ఉండటం గమనార్హం.

 ఎరువుల దందాపై  విజిలెన్స్ పంజా..
 ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందించే ఎరువుల్లోనూ వ్యాపారులు జీరో దందా కొనసాగిస్తున్నారు. వ్యవసాయ శాఖకు లెక్కపత్రాలు చూపించకుండా గోదాముల్లో నిల్వ ఉంచుతూ గుట్టు చప్పుడు కాకుండా జిల్లాలోని మండలాలకు తరలిస్తూ ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తూ రూ.కోట్లు అక్రమమార్గంలో సంపాదిస్తున్నారు. జీరో దందా కోసం ఖమ్మంలోని ఎరువుల గోదాముల్లో నిల్వ ఉంచిన రూ.2.70 కోట్ల విలువైన ఎరువులను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం పట్టుకున్నారు.

వరంగల్ జిల్లా విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంతోపాటు వైరా, చింతకాని, ఏన్కూరు మండలాల్లోని పలు ఎరువుల గోదాములు, పీడీఎస్ నిల్వ కేంద్రాలపై దాడులు నిర్వహించి రూ. 2.70 కోట్ల విలువచేసే ఎరువులు, రూ. 12 లక్షల విలువచేసే పీడీఎస్ బియ్యం, రికార్డులు, రశీదు బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ చేస్తూ దండుకుంటున్నారు.

 తల్లాడలో నకిలీ ఎరువులు తయారు చేస్తూ..
 ఇటీవల తల్లాడ మండలం రెడ్డిగూడెంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో నకిలీ ఎరువుల త యారీ ఉదంతం బయటకు వచ్చింది. గోదావరి ఫామ్ కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ గా నిల్వ ఉంచిన ఎరువులు, కెమికల్స్‌ను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం దా డులు చేసి పట్టుకుంది. నకిలీ కెమికల్స్‌తో ఇక్కడ ఎరువులను తయారు చేయడమే కాకుండా.. ఎక్కువ కాలం నిల్వ ఉంచి జిల్లా రైతులకు కూడా వి క్రయించారు. ఇదంతా విజిలెన్స్ పసిగట్టి ఈ ఫ్యాక్టరీపై దాడిచేసింది. ఇలా జిల్లాలో రైతుల నుజీరోదందా, నకిలీలు నట్టేట ముంచుతున్నా.. రేషన్‌బియ్యం దొడ్డిదా రి పడుతున్నా సంబంధిత ని ఘా వ్యవస్థ మే ల్కోకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement