సీనియర్ ఇంటర్‌లోనూఅమ్మాయిలదే జోరు | Sakshi
Sakshi News home page

సీనియర్ ఇంటర్‌లోనూఅమ్మాయిలదే జోరు

Published Sun, May 4 2014 3:49 AM

Senior Inter-ammayilade pace

  •     జిల్లాలో 55 శాతం మంది విద్యార్థుల ఉత్తీర్ణత
  •      2013 ఫలితాలతో పోలిస్తే ఒక శాతం తక్కువ
  •     రాష్ట్రస్థాయిలో 19, తెలంగాణలో నాలుగో స్థానం
  •  విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ సెకండియర్ వార్షిక పరీక్ష ఫలితాల్లోనూ బాలికల హవానే కొనసాగింది. ఈ ఏడాది మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఫస్టియర్ పరీక్షల ఫలితాలు విడుదల కాగా... ఉత్తీర్ణతలో బాలుర కంటే బాలికలు పైచేయి సాధించారు. జిల్లాలో శనివారం విడుదలైన సెకండియర్ ఫలితాల్లోనూ ఇదే పునరావృతమైంది. సీనియర్ ఇంటర్ జనరల్ విభాగంలో మొత్తం 55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

    జిల్లాలో మొత్తం 43,267 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా... 23,814 మంది ఉత్తీర్ణులయ్యూరు. 21,665 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా... 11,070 మంది (51 శాతం) పాసయ్యూరు. 21,602 మంది బాలికలు పరీక్షలు రాయగా... 12,744 మంది (59 శాతం) ఉత్తీర్ణులయ్యూరు. ఉత్తీర్ణత శాతంలో బాలుర కంటే బాలికలే పైచేయిగా నిలిచారు.
     
    ఒక్క శాతం తగ్గింది...
    గత ఏడాది ఇంటర్ సెకండియర్ వార్షిక పరీక్షల్లో 56 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా... ఈ ఏడాది 55 శాతం మంది పాస్ అయ్యూరు. గత ఏడాది కంటే ఒక శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఉత్తీర్ణత శాతంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా 19వ స్థానంలో నిలవగా... తెలంగాణలో నాలుగో స్థానంలో నిలిచింది.
     
    ప్రభుత్వ కళాశాలల్లో 58 శాతం ఉత్తీర్ణత
     
    జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. 4,366 మంది విద్యార్థులు సెకండియర్ పరీక్షలకు హాజరయ్యూరు. ఇందులో 2,529 మంది విద్యార్థులు (58 శాతం) ఉత్తీర్ణులయ్యూ రు. పరీక్షలకు 2,094 మంది బాలురు హాజరు కాగా... 1134 మంది (54.15 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 2,272 మంది బాలికలు పరీక్షలు రాయగా... 1395 మంది (61.40 శాతం) పాసయ్యూరు. తాడ్వాయి జూనియర్ కళాశాల 92.31 శాతం ఉత్తర్ణత సాధించి జిల్లాలో టాప్‌గా నిలిచింది. కొడకండ్ల జూనియర్ కళాశాల 92.04 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అత్యల్పంగా రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల 15.53 శాతం ఉత్తీర్ణత సాధించింది. 50 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించిన కళాశాలలు జిల్లాలో 26 వరకు ఉన్నాయి. హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 30.70 శాతం మంది, పింగిళి కళాశాలలో 23.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యూరు.
     
    ఒకేషనల్‌లో 46 శాతం ఉత్తీర్ణత
     
    సెకండియర్ ఒకేషనల్ పరీక్షల ఫలితాల్లో 46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 4,781 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 2,223 మంది ఉత్తీర్ణులయ్యారు.
     
    అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు గడువు 9

    ఈనెల 25 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు సెకండియర్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఈ నెల తొమ్మిదో తేదీలోపు ఫీజు చెల్లించాలని ఇంటర్ విద్య ఆర్‌ఐఓ మలహల్‌రావు సూచించారు.
     
     టాపర్లు వీరే..
     ఇంటర్ సెకండియర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లాలో ప్రైవేటు కళాశాలల విద్యార్థులు హవా కొనసాగించా రు. హన్మకొండలోని ఎస్‌ఆర్ కాలేజీ విద్యార్థినులు డి.వైష్ణవి, ఎ.శిరీష ఎంపీసీలో 987 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచారు. బీపీసీలో 984 మార్కులతో ఎస్‌వీఎస్ కాలేజీకి చెందిన ఎం.నాగశ్రీ, సీఈసీ లో శివానీ జూనియర్ కాలేజీ విద్యార్థి ఎస్.ప్రశాంత్ 958 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. వాగ్దేవి జూనియర్ కళాశాల ఎంఈసీ విద్యార్థి డి.భావన 973 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement