జిల్లా అంతటా కెమెరాల ఏర్పాటు | Sakshi
Sakshi News home page

జిల్లా అంతటా కెమెరాల ఏర్పాటు

Published Wed, Sep 17 2014 1:57 AM

Set up cameras throughout the district

తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పోలీస్ శాఖను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా సీసీ కెమెరాలను కొనుగోలుకు నిధులు కేటాయించింది. అన్ని జి ల్లాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతీ జిఆ్లను అనుసంధానం చేసేలా రాజధానిలో ‘ఇంటిగ్రెటెడ్ మాస్టర్ కం ట్రోల్ రూం’ను ఏర్పాటు చేయనున్నారు.

ప్రతి జిల్లాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటిని ఈ కంట్రోల్‌రూమ్‌తో ఇంటర్ లింక్ చేయనున్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఇక మాస్టర్ కంట్రోల్ రూంలో ఎప్పటికీ నిక్షిప్తమై ఉంటుంది. జిల్లాలో కూడా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కోరిన మేరకు ఎస్పీ నివేదిక పంపిం చారు. జిల్లాలో ఎక్కడెక్కడ ప్రధాన రహదారులున్నాయి, ఎన్ని కిలోమీటర్లు, ఎక్కడ కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుటుంది అనే వివరాలతో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.

అయితే తొలుత ఖమ్మం నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఎస్పీ ఉన్నారు. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్ల వివరాలు పూర్తిగా  సేకరించారు. బస్టాండ్ సెం టర్, శ్రీశ్రీ విగ్రహం వద్ద ఇప్పటికే సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా ప లు వ్యాపార సంస్థలు కూడా తమ సముదాయాల్లో సీసీ కెమెరాలు పెట్టుకున్నాయి. నగరం లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎస్పీ పంపిన ప్ర తిపాదనకు ఇప్పటికే కలెక్టర్ అంగీకరించారు.

 నిందితుడిని పట్టించిన సీసీ కెమెరా..
 గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాలు ఓ హత్య కేసులో కీలక నిందితుడిని పట్టించాయి. ఈ కేసులో పోలీసులకు సీసీ కెమెరాలు కీలకమయ్యాయి. గత కొన్నేళ్ల క్రితం ఖమ్మంలో చిన్నారులు కిడ్నాప్‌కు గురై దారుణహత్యకు గురయ్యారు. ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఈ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలింది. అంతేకాకుండా పలు కేసులు పోలీసులకు అంతుచిక్కకుండా ఉన్నాయి.

 తగిన ఆధారాలు లేకపోవడం ఒక కార ణం అయితే నిందితులు ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నారు. ఇది పోలీస్‌లకు సవాల్‌గా మారింది. ఇటీవల సీసీ కెమెరాల సహా యంతో గంటల్లోనే నిందితులను పోలీ సులు పట్టుకుంటున్నారు. ఖమ్మంలో ఈనెల 11న  దారుణ హత్యకు గురైన బాలుడు నిషాంత్ హత్య కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ఈ కేసులో బాలుడికి వరుసకు బాబా యి అయిన మధునే నిందితుడు కావడం గమనార్హం.

హత్య అనంతరం నిందితుడు ఎవరికి అనుమానం రాకుండా నటించాడు. అయితే బాలుడిని ఆస్పత్రి బయటి నుంచి కారులో బయటకు తీసుకెళ్లడంతో ఆస్పత్రి సీసీ కెమెరాలో మధు కారు నంబర్‌తో సహా నిక్షిప్తమైంది. ఇదే కారు వైరా రోడ్డులో సీసీ కెమెరాలో కూడా కనిపించడంతో అతనిపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో  అతన్ని విచారించడంతో బాలుడి హత్య ఉదంతం బయట పడింది. వారం రోజుల్లో ఈ కేసును ఛేదిస్తామని చెప్పిన పోలీసులు సీసీ కె మెరాల సహాయంతో 48 గంటల్లోనే ఛేదిం చారు. సీసీ కెమెరాల సహాయంతో ఒక కేసు మిస్టరీని పోలీసులు ఛేదించడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ప్రాధాన్యం గుర్తించిన పోలీసుశాఖ దశల వారీగా జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement