ఆత్మహత్యల పాపం కేసీఆర్‌దే | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యల పాపం కేసీఆర్‌దే

Published Sat, Oct 18 2014 3:18 AM

Shabbir Ali takes on KCR

మాచారెడ్డి : తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పాపం కేసీఆర్‌దేనని ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ ఆరోపించారు. శుక్రవారం కరీంగనగర్ జిల్లాలో జరిగిన రైతు భరోసాయాత్రలో పాల్గొని వ చ్చిన ఆయన మాచారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రా ష్ట్రంలో ఇప్పటి వరకు విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి 203 మంది రైతులు ఆత్మహత్యలకు పా ల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. తా ము అధికారంలోకి రాగానే రైతాం గానికి ఏడుగంటల ఉచిత విద్యుత్ అందించామన్నారు.ప్రస్తుతం ప్రభు త్వం విద్యుత్‌ను ఎందుకు అందించలేకపోతుందని ప్రశ్నించారు. ఎన్నికల మెనిఫెస్టోలో పేర్కొన్నట్లు రైతాంగానికి 8 గంటలు నిరాటంకంగా అందిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రస్తుతం మూడు గంటలైనా ఇవ్వకపోవడం విడ్డూరమన్నారు.

కేసీఆర్ గోల్కొండ కోటను పున రుద్ధరించి దాంట్లో మకాం  వేయడం దేనికి దారితీస్తుందో చెప్పాలన్నారు. అంతేకాకుండా నిజాంవారసుల సంస్థానాలకు వెళుతూ వారితో మంతనాలు  జరుపడం దేనికి దారితీస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి రైతాంగాన్ని ఆదుకోకుంటే తెలంగాణ వల్లకాడు అవుతుందన్నారు. సమావేశంలో మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్‌రావు, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షడు ఆంజనేయలు, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసచారి, నర్సింహారెడ్డి, మాచారెడ్డి ఉపసర్పంచ్ అలీఖాన్ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement