శౌర్యచక్ర అందుకున్న శ్రీనివాసులు | Sakshi
Sakshi News home page

శౌర్యచక్ర అందుకున్న శ్రీనివాసులు

Published Fri, Apr 7 2017 2:44 AM

శౌర్యచక్ర అందుకున్న శ్రీనివాసులు

అశోక హాల్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం
రాష్ట్ర సీఐ సెల్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీనివాసులు
తెలంగాణ నుంచి తొలి వ్యక్తిగా రికార్డు


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగా నికి మరో అరుదైన గౌరవం దక్కింది. బెంగళూరు లోని పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్‌ పరిధిలో గత ఏడాది జనవరి 23న మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది ఆలమ్‌ జెబ్‌ అఫ్రీదిని ప్రాణాలకు తెగించి పట్టుకున్న తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ (సీఐ) సెల్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కుకుడపు శ్రీనివాసులు ప్రతిష్టాత్మకమైన శౌర్యచక్ర అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్‌లో గురువారం జరిగిన అధికారిక కార్య క్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆయనకు అవార్డు ప్రదానం చేశారు. ఉగ్రవాది కత్తి దాడిలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్నా...

ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తించిన శ్రీనివాసులుకు గత ఏడాది ఆగస్టులో శౌర్యచక్ర ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాల కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులతో సహా మొత్తం 12మందికి శౌర్యచక్ర ప్రకటించగా... అందు లో శ్రీనివాసులు ఒక్కరే దక్షిణాదికి చెందిన పోలీసు అధికారి కావడం విశేషం. కానిస్టేబుల్‌ హోదాలో ప్రతి ష్టాత్మకమైన శౌర్యచక్ర పొందిన వ్యక్తిగానూ ఈయన రికార్డులకెక్కారు.

గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్సుల్లో సేవలు...
నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీనివాసులు 1998లో కానిస్టేబుల్‌గా పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. గ్రేహౌండ్స్‌తో పాటు హైదరాబాద్‌ కమిషనర్స్‌ టాస్క్‌ ఫోర్స్‌ల్లో సుదీర్ఘ కాలం సేవలందించారు. కొన్నేళ్లుగా సీఐ సెల్‌లో పనిచేస్తున్నారు. ఐసిస్‌కు అనుబంధంగా, హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్రపన్నిన ‘జేకేహెచ్‌’సంస్థ ఉగ్రవాదుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు గత ఏడాది జనవరిలో అరెస్టు చేశారు. వీరికి శిక్షణ ఇవ్వడంలో కీలకపాత్ర పోషించింది ఆలమ్‌ జెబ్‌ అఫ్రీది అని సీఐ సెల్‌ అధికారులు గుర్తించారు.

ఇతడిపై దేశ వ్యాప్తం గా 25 వరకు పేలుళ్లు, కుట్ర, విద్రోహక చర్యల కేసులు నమోదై ఉన్నాయి. 2008 నుంచి పరారీలో ఉన్న ఇతడు... మెకానిక్‌ అవతారం ఎత్తి, రఫీఖ్‌ పేరుతో కర్ణాటకలోని దొడ్డినాగమంగళం ప్రాంతంలో నివసిస్తున్నట్లు సీఐ సెల్‌ అధికారులు 2016 జనవరి 23న గుర్తించారు. దీంతో శ్రీనివాసులుతో పాటు మరో ముగ్గురి బృందాన్ని అక్కడకు పంపారు.

రక్తమోడుతున్నా ఉగ్రవాదిని వదల్లేదు...
రంగంలోకి దిగిన శ్రీనివాసులు బృందం బెంగళూరులోని పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న వినాయకనగర్‌లో అఫ్రీది కదలికల్ని గుర్తించింది. ఎన్‌ఐఏ బృందం ఆ ప్రాంతానికి దూ రంగా ఉండటం, వారు వచ్చేలోపు అఫ్రీది పారి పోయే ప్రయాదం ఉందని వీరు భావించారు. దీం తో ఈ నలుగురే అతడిని అదుపులోకి తీసుకో వడానికి ప్రయత్నించారు.

ఈ క్రమంలో అఫ్రీది కత్తితో శ్రీనివాసులు పొత్తికడుపులో బలంగా పొడి చాడు. ఈ దాడిలో శ్రీనివాసులు పేగులు బయటకు రావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విపరీతమైన రక్తస్రావం అవుతున్నప్పటికీ లెక్కచేయని శ్రీనివాసు లు అఫ్రీదిని వదలకుండా పట్టుకున్నాడు. రెండు గంటల తరువాత పోలీసు బృందాలు వచ్చి అఫ్రీది ని అదుపులోకి తీసుకున్నాయి. శ్రీనివాసులు దాదాపు 20 రోజులు అక్కడే చికిత్స పొందారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement