మాటువే షి ఆటకట్టిస్తారు! | Sakshi
Sakshi News home page

మాటువే షి ఆటకట్టిస్తారు!

Published Mon, Mar 2 2015 3:02 AM

she team

‘నేను రోజూ బస్‌లో కాలేజీకి వెళ్తా.. ఓవ్యక్తి నాతో వారం రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. వేధింపులు ఇప్పుడు మరీ ఎక్కువైనయ్.. పోకిరీ బారి నుంచి నన్ను కాపాడండి’ అంటూ ఓ యువతి ‘డయల్ 100’కు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న ఓ బృందం వెంటనే రంగంలోకి దిగింది. సదరు విద్యార్థిని అనుసరించింది. పోకిరీ చేష్టల్ని సీక్రెట్ కెమెరాలో చిత్రీకరించింది. దీని ఆధారంగా పోకిరీ ఆటకట్టించింది. ఈ ప్రత్యేక బృందం పేరే ‘షీ’.
 
 కరీంనగర్ క్రైం : ప్రస్తుతం హైదారాబాద్‌లో సమర్థవంతంగా పొకిరీలకు చెక్ పెడుతున్న ‘షీ’టీంలను కరీంనగర్‌లోనూ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మహిళపై వేధింపులు, ఇతరత్రా నేరాలు పెరిగిపోవడంతో షీ బృందాలు అనివార్యమైని భావించి ఇందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో మహిళలపై జరుగుతున్న నేరాలు 1200పైగా నమోదవుతున్నారుు. వీటిలో 330కిపైగా వేధింపుల కేసులు ఉంటున్నారుు. మహిళను వేధిస్తున్నవారిలో యువకులు, విద్యార్థులతో పాటు ఉద్యోగులు ఉంటున్నారు. ఇందులో 30నుంచి 50ఏళ్ల  పురుషులుంటున్నారు.
 
 మఫ్టీలో నిఘా.. చిక్కితే జైలు..
 జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్లు, కాలేజీలు, ఆటోలు, ఇతర ప్రాంతాల్లో మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ఈ ప్రాంతాల్లో షీ బృందాలు నిఘా పెడుతాయి. ఇందుకోసం త్వరలో అందుబాటులోకి రానున్న సిటీ బస్సుల్లో కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులతో ‘షీ’ బృందాలు కలిసిపోతాయి. ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరిస్తారుు. పోకిరీలు రెచ్చిపోగానే సీక్రెట్ కెమెరాల్లో చిత్రీకరించిన వెంటనే అదుపులోకి తీసుకుంటారుు. తాము ఎవరినీ వేధించడంలేదంటూ నిందితులు తప్పించుకునే వీలు లేకుండా కెమెరాల్లోని దృశ్యాలను సాక్ష్యంగా నిలుస్తాయి.
 
 తొలిసారి చిక్కితే కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ చేస్తారు. మరోసారి తప్పు చేయనని లిఖితపూర్వకంగా రాయించుకుని వదిలేస్తారు. రెండోసారి మహిళలను వేధిస్తూ చిక్కితే.. వెంటనే వివిధ సెక్షన్లతోపాటు నిర్భయ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తారు. ప్రస్తుతం ప్రతీ డివిజన్‌లో వాట్సప్ సేవలు  అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు డయల్ 100కు ఫోన్ చేసినా, మెసేజ్ పంపినా పోలీసులు స్పందించి షీ బృందాలకు సమాచారం అందిస్తారు. ఉదయం నుంచి 8 నుంచి 10, రాత్రి 7 నుంచి 9గంటల వరకు ప్రధాన ప్రాంతాలు, బస్టాండ్లు, కాలేజీ అడ్డాల్లో షీ టీంలు మాటు వేస్తారుు. పోకిరీలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఠాణాకు తరలిస్తారుు.
 
 విస్తృత ప్రచారం..
 బస్సులు, ఆటోలు, బస్టాంప్‌ల్లో మహిళలు, యువతులకు రక్షణగా తామున్నామంటూ షీ బృందాలు ప్రచారం చేస్తాయి. సాధారణ వ్యక్తుల్లో కలిసిపొయి వేధింపు లు ఆరంభం కాగానే తామున్నామంటూ బాధితులకు ధైర్యం చెబతారుు. అయితే షీ టీంలో ఎవరున్నది గోప్యంగా ఉంచుతారు. ఆపరేషన్ పూర్తి చేశాకా అక్కడినుంచి నిష్ర్కమిస్తారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి పోకిరీల ఆటకట్టిస్తారు.
 

Advertisement
Advertisement