రాత్రయితే చాలు.. | Sakshi
Sakshi News home page

రాత్రయితే చాలు..

Published Sun, May 25 2014 2:53 AM

Sociopaths activities when night times

 గతంలో జిల్లా పంచాయతీ కార్యాలయం ఇదే కార్యాలయంలో ఉండేది. భవనం సరిగ్గా లేక ప్రమాదకరంగా మారడంతో జిల్లా పరిషత్‌కు దగ్గరున్న ఓ భవనంలోకి మా ర్చారు. దీంతో నిజామాబాద్ డివిజనల్ పం చాయతీ కార్యాలయాన్ని పాడుబడ్డ భవనంలోకి మార్చారు. అయితే ఈ కార్యాలయ ఆవ రణ ఇది నిత్యం మందుబాబులకు  అడ్డాగా మారింది. ప్రభు త్వ కార్యాలయం అని చూడకుండా రాత్రయితే చాలు అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఈ విష యం తెలిసినా అక్కడున్న అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో మందుబాబులకు అడిందే ఆటగా పాడిందే పాటగా మారింది.

 డీఎల్‌పీఓ కార్యాలయం వెనుక భాగం మొత్తం చెట్లు,ముళ్ల పొదలు ఉండటంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కనీసం విద్యుత్ దీపాలు లేకపోవడం మందుబాబులకు కలిసొచ్చింది. దీంతో చెట్ల పొదల్లో ఎక్కడ చూసినా తాగి పడేసిన ఖాళీ మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయి. పాడుబడ్డ భవనంలో డీపీఓ కార్యాలయం ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితే ఉండగా ప్రస్తుతం డీఎల్‌పీఓ కార్యాలయం రావడంతో మందుబాబుల తాకిడి మరింత పెరిగింది.

 భవనం మీద సిట్టింగులు
 అసాంఘిక కార్యకలాపాలతో కార్యాలయ ఆవరణతో మందుబాబులు హల్‌చల్ చేస్తుంటే... ఏకంగా భవనం పైనే సిట్టింగులు నడుస్తున్నాయి. బయటి వ్యక్తులు ఎవరూ రావడానికి వీలు లేని ఈ భవనంపైకి ఎక్కి తాగే దమ్ము, ధైర్యం ఎవరికీ ఉండదు. కార్యాలయంలో పని చేసే ఉద్యోగులే అయి ఉంటారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాత్రుల్లో కాపలాగా వాచ్‌మన్, అటెండర్ ఉండగా బయటి వ్యక్తులు వచ్చే ఆస్కారం ఉం డదు. ఆ శాఖకు చెందిన కొందరు ఉద్యోగులు వారానికి నాలుగు సార్లు భవనంపై సిట్టిం గులు వేసి మద్యం తాగుతున్నట్లు తెలిసింది.

అక్కడ మద్యం బాటిళ్ల ఆనవాళ్లు లేకున్నా బీరుకు సంబంధించిన ఖాళీ కార్టన్ డబ్బాలు ఉన్నాయి. అనుమానం రాకుండా తాగిన మద్యం ఖాళీ సీసాలు అక్కడే ఉంచకుండా చెట్ల పొదల్లో పడేస్తున్నారు. కాగా భవనంపైన దావత్‌లు చేసుకునే ఉద్యోగులు అక్కడే పలు సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయటి వ్యక్తులతో పాటు, శాఖ ఉద్యోగులు కూడా అసాంఘిక కార్యాలకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిసినా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement