‘సోలార్’ కోసం భూముల అన్వేషణ | Sakshi
Sakshi News home page

‘సోలార్’ కోసం భూముల అన్వేషణ

Published Tue, Dec 2 2014 12:24 AM

‘సోలార్’ కోసం భూముల అన్వేషణ - Sakshi

  • పరిశీలించిన ఎన్టీపీసీ, ఉన్నతాధికారుల బృందం
  • సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించిన సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రత్యామ్నాయ విద్యుత్ వనరులైన సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా  కొంతైనా విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కవచ్చని భావిస్తోంది. ఇందులో భాగం గా ఈ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను నిపుణుల బృందం అన్వేషిస్తోంది.

    సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం దోడంద గట్టేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని టెకిడిగూడ శివారులోని భూములను ఎన్టీపీసీ, ఎన్‌వీవీఎన్, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌ఈఈపీసీవో, ఎన్‌హెచ్‌పీసీ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల బృందం పరిశీలించింది. ఇప్పటికే రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటించిన ఈ బృందం ఆదిలాబాద్‌లో మావల గ్రామ పంచాయతీ పరిధిలోని భూములను కూడా పరిశీలించింది. వీరి వెంట తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ అధికారుల బృందం కూడా ఉంది.
     
    500 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు?

    రాష్ట్రంలో ఐదు వందల మోగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే కనీసం ఐదు ఎకరాల భూమి అవసరం ఉంటుందని టీఎస్ ఐఐసీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ లెక్కన 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన భూ ములను అన్వేషిస్తున్నారు. ఈ ప్లాంట్లు పూర్త యి.. ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన పక్షంలో ఆ విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించేందుకు అనువైన విద్యుత్ లైన్లు, సబ్‌స్టేష న్లు వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు.
     

Advertisement
Advertisement