త్వరలోనే నగదు రహిత తెలంగాణ | Sakshi
Sakshi News home page

త్వరలోనే నగదు రహిత తెలంగాణ

Published Wed, Dec 7 2016 4:00 AM

త్వరలోనే నగదు రహిత తెలంగాణ - Sakshi

► బ్యాంకు అధికారులతో భేటీలో సీఎం కేసీఆర్
►కొద్ది రోజులుగా డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్
►నగదు రహిత విధానంపై ఆలోచన మారాలి.. ప్రజల్లో మార్పు రావాలి
►రాష్ట్రానికి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు
►అందించేందుకు ముందుకొచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు

 
సాక్షి, హైదరాబాద్: నగదు రహిత విధానంతో కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులు సైతం నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డిజిటల్ చెల్లిం పులను అభివృద్ధి చేసేందుకు, ప్రజలకు అవసరమైన సేవలను అందించేందుకు బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ ముందుకు వచ్చింది. మంగళవారం ఆ బ్యాంకు అధికా రులు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వారు వివరించారు. సాధ్యమైనంత త్వరలోనే తెలంగాణ రాష్ట్రం పూర్తిస్థాయి డిజిటల్ విధానాన్ని అలవరుచుకుంటుందని, నగదు రహిత లావాదేవీలు జరిపే రాష్ట్రంగా నిలుస్తుందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

గత ఐదు రోజులుగా ప్రతిరోజు అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు జరుపు తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. ప్రజలకు సాంకేతికత ఉపయోగించుకోవడం తెలియదని కాదని... నగదు వాడకంలో ఉండటంతో డెబిట్ కార్డులు, స్వైపింగ్ యంత్రాలు అలవాటు కాలేదని చెప్పారు. అందుకే ప్రజల ఆలోచనా విధా నాన్ని మార్చే దిశగా అవగాహన కల్పించా లని, అందుకు బ్యాంకులు తగిన సహకారం అందించాలని సీఎం కోరారు.

తొలి దశలో ప్రభుత్వ చెల్లింపులు...
అరుుతే హడావుడి, ఆగమాగం చేయవద్దని... మొదటి దశలో ప్రభుత్వంతో సంబంధమున్న ఆర్థిక లావాదేవీలను డిజిటల్ పద్ధతిలో జరిగేలా చూడాలని సీఎం కేసీఆర్ పేర్కొ న్నారు. రిజిస్ట్రేషన్లు, పౌర సరఫరాలు, కాం ట్రాక్టర్లకు బిల్లులు, ఉద్యోగుల జీతాలు వంటివన్నీ డిజిటల్ రూపంలో జరగాలని చెప్పారు. రైతులకు ధాన్యం అమ్మితే వచ్చిన డబ్బును బ్యాంకు ఖాతాలను మళ్లించాలని, వారు డ్రా చేసుకునే క్రమంలో ఎలక్ట్రానిక్ చెల్లింపుల పద్ధతి క్రమంగా అలవాటవుతుం దని పేర్కొన్నారు. అయితే ప్రజలకు నగదు లావాదేవీల అవసరం కొంతమేరకు ఎల్లప్పు డూ ఉంటుందని చెప్పారు.

రాబోయే కాలంలో అన్ని రకాల పన్నులు రద్దయి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ మాత్రమే విధించే అవకాశాలున్నాయని.. భవిష్యత్తు మార్పులకు అనుగుణంగా ప్రజల్లో మార్పు రావాలని పిలుపునిచ్చారు. బ్యాంకు మేనే జర్లు, అధికారులు ప్రజలకు సహకరిం చాలని సూచించారు. బ్యాంకు అధికారులతో సమా వేశమై చర్చలు జరపాలని మంత్రి కె.తారక రామారావును ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నతా దికారులు సిద్ధార్థ మిశ్రా, వినీత్ మల్హోత్రా, అవిజిత్ షా, జితా మిత్రా, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

14న టీఎస్ వాలెట్ ఆవిష్కరణ
ఈనెల 14న జరిగే కలెక్టర్ల సదస్సులో టీఎస్ వాలెట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించ నున్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందిం చిన ఈ మొబైల్ యాప్‌ను కలెక్టర్ల సదస్సులో విడుదల చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
ప్రజలకు ప్రచారమే కీలకం
నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేలా మీడియా ద్వారా ప్రసారం చేయాలని మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. నగదు నోట్లుంటే దొంగలెత్తుకుపోయే ప్రమాదముందని.. డిజిటల్ పద్ధతిలో పూర్తి భద్రత ఉంటుందనే కోణంలో సామాన్యులకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బ్యాంకుల వారీగా ఎన్ని కార్డులున్నాయి, ప్రజల అవసరాలు తీరుస్తున్నాయా.. లేదా, వాడుకలో ఉన్నవెన్ని, కొత్తగా అవసరమైనవెన్ని.. వంటి అంశాలపై బ్యాంకుల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాలని సీఎంవో అధికారులకు సూచించారు.

మొబైల్ అప్లికేషన్ల ద్వారా బ్యాంకు, ఆర్థిక లావాదేవీలు నిర్వహించేలా గ్రామీణ యువతకు శిక్షణనివ్వాల్సిన అవస రముందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వారి ద్వారా గ్రామాల్లో రైతులు, కూలీలు, నిరక్షరాస్యులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విధానాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉండే పంచాయతీ కార్యదర్శులు తదితర ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలన్నారు.

Advertisement
Advertisement