కరోనాపై పోరాటానికి సూపర్‌ రోబో | Sakshi
Sakshi News home page

సూపర్‌ రోబో తయారు చేసిన ఇండియన్‌ రైల్వే

Published Sat, May 16 2020 3:22 PM

South Central Railways develops Rail-BOT To Help Corona Patients - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనాపై యుద్దం చేస్తోన్న డాక్టర్లు, హెల్త్‌ వర్కర్స్‌కి సాయం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే ఒక రోబోను అభివృద్ధి చేసింది. దీనిని రైల్‌బోట్‌ లేదా ఆర్‌-బోట్‌గా పిలుస్తున్నారు. ఇది వైద్యులకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందించడంలో సాయం చేస్తోంది. కేవలం డాక్టర్లకు మాత్రమే కాకుండా కరోనా పేషెంట్లకు ఆహారాన్ని కూడా అందిస్తుంది. ఈ రోబోను వైఫై, మొబైల్‌ యాప్‌ ద్వారా ఆపరేట్‌ చెయ్యొచ్చు. యాప్‌ ఓపెన్‌ చేసి ఏం చేయాలో సూచనలు ఇస్తే చాలు ఈ రోబో వాటికి తగ్గట్టుగా పనిచేయడం మొదలు పెడుతుంది. ఈ రోజు కేవలం కావలసిన వస్తువులు, పరికరాలు, ఆహారం, నీళ్లు అందించడమే కాదు ఎవరైనా దాని ముందు చేయి పెడితే శరీర ఉష్ణోగ్రత ఎంత ఉందో కూడా చూస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే రోబోకు ప్రత్యేకంగా ఉండే ఎర్రలైట్‌ వెలుగుతుంది. అప్పుడు అందరూ అప్రమత్తమై ఆ వ్యక్తిని ఐసోలేట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోబోకి పైన రియల్‌టైమ్‌ కెమెరా కూడా ఉంటుంది. ఈ కెమెరా సాయంలో అది కిందకి, పైకీ, చుట్టుపక్కలకు తిరిగి అక్కడ ఉన్నవన్ని రికార్డు కూడా చేయగలదు. దీని సాయంతో రోబో ఎక్కడికి వెళుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు. 

వీటితో పాటు ఈ రోబోకు ఉన్న మరికొన్ని  ప్రత్యేకతలు: 

  • ఇందులో నైట్‌ ల్యాంప్‌, నైట్‌ విజన్‌ కెమెరాలు కూడా ఫిక్స్‌ చేశారు. దీని కారణంగా ఇది కరెంటు లేని ప్రదేశాల్లో కూడా సేవలను అందిచగలదు.
  • ఇది గంటకు 1కిలోమీటర్‌ వరకు వెళ్లగలదు. దీంతో చాలా త్వరగా సేవలు అందించగలదు.
  • 80 కేజీల కంటే ఎక్కువ బరువును మోయగలదు. 
  • ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే 7 గంటల పాటు నిరవధికంగా పనిచేస్తూ ఉండగలదు. 
  • ఇది వ్యక్తులతో కూడా మాట్లాడుతుంది. వాళ్ల మాటల్ని, తన మాటల్ని కూడా రికార్డు చేస్తోంది. 
  • దీనికున్న కెమెరాల సాయంతో రోబో ఎక్కడి వెళుతుందో తెలుసుకోవచ్చు. మనం పంపాలనుకున్న చోటుకు రోబోను పంపొచ్చు. 

 
 

Advertisement
Advertisement