సిటీ నుంచి ప్రత్యేక రైళ్లు  | Sakshi
Sakshi News home page

సిటీ నుంచి ప్రత్యేక రైళ్లు 

Published Wed, Jul 4 2018 1:21 AM

Special trains from City - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌–కాకినాడ (07001/ 07002) ప్రత్యేకరైలు శుక్రవారం రాత్రి 9.05కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25కి కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 8న సాయంత్రం 5.10కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కి హైదరాబాద్‌ చేరుకుంటుంది. కాచిగూడ–కాకినాడ (07425/ 07426) ప్రత్యేకరైలు ఆగస్టు 3, 10, 17, 24, 31, సెప్టెంబర్‌ 7, 14, 21, 28, అక్టోబర్‌ 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 6.45కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.

తిరుగుప్రయాణంలో ఆగస్టు 4, 11, 18, 25, సెప్టెంబర్‌ 1, 8, 15, 22, 29, అక్టోబర్‌ 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 5.50కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.10కి కాచిగూడ చేరుకుంటుంది. నర్సాపూర్‌–హైదరాబాద్‌ (07258)ప్రత్యేకరైలు ఆగస్టు 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.45కి హైదరాబాద్‌ చేరుకుంటుంది. హైదరాబాద్‌–విజయవాడ (07257) ప్రత్యేకరైలు ఆగస్టు 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 10.20కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.35కి హైదరాబాద్‌ చేరుకుంటుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement