‘తెలంగాణ ఖాతా’పై ఆర్‌బీఐతో ఒప్పందం | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ ఖాతా’పై ఆర్‌బీఐతో ఒప్పందం

Published Wed, May 14 2014 4:01 AM

state government deals with RBI on Telangana state Account

జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి తెలంగాణ రాష్ట్ర ఖాతా
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖాతా ఏర్పాటుపై ఆర్‌బీఐ, రాష్ట్రప్రభుత్వం మధ్య అగ్రిమెంట్ కుదిరింది. గవర్నర్ తరఫున రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి ముంబై ఆర్‌బీఐ అధికారులతో మంగళవారం ఒప్పందం చేసుకున్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్నందున ఆ రోజు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లావాదేవీలు కొనసాగించేందుకు వీలుగా ఈ ఖాతా అమల్లోకి రానుంది. జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖాతా అమల్లోకి వచ్చేవిధంగా గవర్నర్ నరసింహన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

Advertisement
Advertisement