చురుగ్గా కూలీల వివరాల సేకరణ | Sakshi
Sakshi News home page

చురుగ్గా కూలీల వివరాల సేకరణ

Published Wed, May 6 2020 2:58 AM

State Government Working On To Send Migrant Workers To Their Own Place - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి, ఆందోళనతో స్వస్థలాల బాటపట్టిన వలస కూలీలను సొంత ప్రాంతాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైం ది. మరో 40 రైళ్లలో ఈ కూలీ టలందరిని స్వగ్రామాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర భారతదేశా నికి చెందిన లక్షలాది మంది వలస కార్మికుల వివరాలు సేకరించాల ని డీజీపీ కార్యాలయం ఆదేశించడంతో రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లు ఇదే పనిలో పడ్డాయి. విషయం తెలుసుకున్న పలువురు కూలీలు సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి బారులు తీరుతున్నారు. వలస కూలీలకు సంబంధిం చిన ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు చూపించి నమోదు చేసుకుంటున్నారు. వీటి ఆధారంగా ఏయే ఠాణా పరిధిలో ఏ రాష్ట్రం కూలీలు అధికంగా ఉన్నారో తేల్చి వారిని ఉన్నతాధికారు లు సూచించిన రైల్వే స్టేషన్‌కు పంపేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నా రు. ఆదేశాలు వచ్చిన వెంట నే తరలించేందుకు స్థానికం గా ప్రైవేటు బస్సుల యాజ మాన్యాలతోనూ పోలీసులు మాట్లాడి ఉంచారు.

డేటా మొత్తం నిక్షిప్తం.. 
కూలీలకు సంబంధించిన వివరాలన్నీ ప్రతీ పోలీసు స్టేషన్‌ నుంచి ఎస్పీ/ కమిషనరేట్‌ కార్యాలయాలకు అక్కడ నుంచి డీజీపీ కార్యాలయానికి వెళ్లాయి. అక్కడ ఐటీ విభాగంలో కూలీల డేటా నిక్షిప్తమవుతుంది. కూలీల చిరునామాల ఆధారంగా వారి సొంత జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లకు ఈ వివరాలు అందజేస్తారు. నిరక్షరాస్యులు, స్థానిక భాష రాని వలసకూలీలు  పోలీసు స్టేషన్‌కి వెళ్లి పేరు నమోదు చేసుకుంటే..ప్రభుత్వమే ప్రత్యే క రైలులో పంపుతుందన్న విషయంపై వారికి సమాచారం లేదు.  వీరిని రాష్ట్రం దాటకుండా అడ్డుకుని ప్రత్యేక రైళ్ల ద్వారా పంపే బాధ్యతను పోలీసులే తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement